న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్నారా..? అనుమతి కావాలంటే ఈ తేదీలోపే అప్లై చేసుకోండి

న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్నారా..? అనుమతి కావాలంటే ఈ తేదీలోపే అప్లై చేసుకోండి

న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమయ్యే వాళ్లకు సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారు. న్యూ ఇయర్ 2026 ఈవెంట్లకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని తెలిపారు. న్యూ ఇయర్ ఈవెంట్స్ నిర్వహించాలనుకునే వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

2025 డిసెంబర్ 21- లోపు మాత్రమే ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.  టికెట్ ఈవెంట్లకు కమర్షియల్ లేదా టికెటెడ్ ఫారం ఎంపిక చేస్తారు. టికెట్ లేకుండా జరిగేవాటికి నాన్ కమర్షియల్ ఫారం ఇవ్వనున్నారు. దరఖాస్తులు ఆన్ లైన్ లోనే చేసుకోవాల్సి ఉంటుంది. 21వ తేదీ తర్వాత దరఖాస్తులు పరిగణలోకి తీసుకోమని- సైబరాబాద్ పోలీసులు తెలిపారు.

ఆన్ లైన్ అప్లికేషన్స్ కోసం సంప్రదించాల్సిన వెబ్ సైట్:

 cybpms.telangana.gov.in