అధికారిక లాంఛనాలతో ముఖేష్ గౌడ్ అంత్యక్రియలు

అధికారిక లాంఛనాలతో ముఖేష్ గౌడ్ అంత్యక్రియలు

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముకేశ్ గౌడ్  అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.  కొన్ని నెలలుగా కేన్సర్ తో బాధపడుతూ హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన ముఖేశ్ గౌడ్ సోమవారం తుది శ్వాస విడిచారు. ముఖేష్ గౌడ్ కు భార్య,ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ముఖేష్ గౌడ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన మృతిపట్ల పలు పార్టీలకు చెందిన నాయకులు, ప్రముఖులు సంతాపం తెలిపారు