గతేడాది ట్రాపిక్ ఫైన్లు రూ. 613 కోట్లు.. హెల్మెట్ కేసులే ఎక్కువ

గతేడాది ట్రాపిక్ ఫైన్లు రూ. 613 కోట్లు.. హెల్మెట్ కేసులే ఎక్కువ
  • ఆరేండ్లలో 1,700 కోట్ల ఫైన్లు!
  • ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నోళ్లపై చలాన్లతో పోలీసుల వాత 
  • 2014లో రూ.95 కోట్లు.. 2020లో రూ.613 కోట్ల ఫైన్లు   
  • ఏటా కోటి దాటుతున్న ట్రాఫిక్​ రూల్స్​ బ్రేకింగ్​ కేసులు

హైదరాబాద్, వెలుగు: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. కోట్ల రూపాయల ఫైన్లు కడ్తున్నరు. రాష్ట్రంలో గత మూడేండ్లుగా ఏటా మోటార్ వెహికల్ యాక్ట్ కింద కోటికిపైగా కేసులు నమోదవుతున్నాయి. ఫైన్లు వందల కోట్లకు చేరుతున్నయి. ముఖ్యంగా మూడేండ్లుగా కేసులు, ఫైన్లు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఎన్ని ఫైన్లు వేసినా.. వాహనదారులు ట్రాఫిక్ సీసీ కెమెరాలు, పోలీసుల డిజిటల్ కెమెరాలకు మళ్లీ మళ్లీ చిక్కుతున్నారు. ఈ-చలాన్‌‌ రికార్డుల్లోకి ఎక్కుతున్నారు. హెల్మెట్‌‌, సిగ్నల్‌‌ జంపింగ్‌‌, డ్రంకెన్ డ్రైవ్.. వంటి కేసుల్లో బుక్‌‌ అయిపోతున్నరు. రాష్ట్రవ్యాప్తంగా ఆరేండ్లలో మొత్తం 6.57 కోట్ల ఎంవీ యాక్ట్‌‌ కేసులు నమోదు కాగా, మొత్తం రూ.1,794 కోట్ల ఫైన్లు వేశారు.

ఒక్కో చలాన్ పై 35 సర్వీస్ చార్జ్  

వెహికల్‌‌ రోడ్డెక్కిన దగ్గర్నుంచి ఇంటికెళ్ళేంత వరకు ప్రతి చౌరస్తాలోనూ ట్రాఫిక్ పోలీసులు నిఘా పెడ్తున్నారు. రోడ్లపై సీసీటీవీ కెమెరాలు, స్పీడ్‌‌గన్స్‌‌, హ్యాండ్‌‌ డిజిటల్ కెమెరాలతో చలాన్లు జనరేట్ చేస్తున్నారు. దీనికి తోడు  డ్రంకన్‌‌ డ్రైవ్‌‌ కేసుల్లో  కోర్టులు రూ.10 నుంచి 20 వేల వరకు ఫైన్లు వేస్తున్నాయి. అలాగే సర్వీస్ చార్జీల పేరుతో ప్రతీ చలానాపై రూ.35 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా గత మూడేళ్లుగా ఏటా కోటికి పైగా కేసులు రిజిస్టర్‌‌‌‌ అవుతున్నాయి. గ్రేటర్‌‌‌‌ పరిధిలోని మూడు కమిషనరేట్లలోనే ఫైన్స్‌‌ రూ.కోట్లలో ఉంటున్నాయి.

ట్రాఫిక్ పోలీసులకు చలాన్ల టార్గెట్

ఒక్కో కానిస్టేబుల్‌‌ ప్రతిరోజూ 250 చలానాలు జనరేట్‌‌ చేయాలని ఆఫీసర్లు టార్గెట్ పెడ్తున్నారు. రూల్స్ బ్రేకర్స్‌‌ కోసం స్పెషల్‌‌ డ్యూటీలు చేస్తున్నారు. కంటికి కనిపించకుండా పక్కకు నిలబడుతూ కెమెరాలతో క్లిక్‌‌ చేస్తున్నరు. రోడ్‌‌ సేఫ్టీ రూల్స్‌‌లో భాగంగా ప్రాణాలకు తీవ్ర హాని కలిగించే18 రకాల రూల్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు.

ఫస్ట్‌‌ ప్లేసులో హెల్మెట్‌‌ ఫైన్లు 

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనల్లో హెల్మెట్ వయోలేషన్లే ఎక్కువగా ఉన్నాయి. డ్రంకెన్‌‌ డ్రైవ్ కేసుల్లో చిక్కిన వారికి ఫైన్స్‌‌తోపాటు జైలు శిక్షలతో పనిష్మెంట్లు ఇస్తున్నారు. పాయింట్స్‌‌ వైజ్ గా కౌంట్‌‌ చేసి డ్రైవింగ్‌‌ లైసెన్స్‌‌లు క్యాన్సిల్‌‌ చేస్తున్నారు. ఇలా ఏటా మన పోలీసులు కోట్లల్లో ఫైన్లు వేస్తున్నారు. ఈ వివరాలను టీఎస్‌‌ కాప్‌‌ ట్యాబ్స్ లో ఫీడ్ చేస్తున్నారు. ట్రాఫిక్ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌లో పెండింగ్‌‌ చలానా ఉంటే వెహికల్స్‌‌ సీజ్‌‌ చేస్తున్నారు. అమౌంట్​ కట్టే దాకా బండ్లు ఇవ్వట్లేదు.

ట్రాఫిక్ కంటే ఫైన్ల మీదే ఎక్కువ ఫోకస్

“రోడ్‌ సేఫ్టీ రూల్స్‌ ను ఇంప్లిమెంట్‌ చేయడం బాగానే ఉంది. ట్రాఫిక్ రూల్స్‌ బ్రేక్ చేస్తున్న వారిపై యాక్షన్‌ తీసుకోవాలి. ఇది మంచిదే. కానీ పోలీసులు ట్రాఫిక్‌ కంట్రోల్‌ కంటే ఫైన్స్‌ వేయడంపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టారు. రోడ్లపై ట్రాఫిక్ జాంలను పట్టించుకోకుండా చలానాలు జనరేట్ చేయడంపైనే దృష్టి పెట్టడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్తున్నరు. హెల్మెట్‌ పెట్టుకోకపోతే రూ.100 ఫైన్‌ అయితే రూ.35 సర్వీస్ చార్జ్ జనరేట్ చేస్తున్నారు. ఇట్లాంటి సర్వీస్‌ చార్జీలే రూ.లక్షల్లో వసూలు చేస్తున్నరు.’’

‑ లింగస్వామి, సాఫ్ట్​వేర్ ఇంజనీర్‌‌, ఎల్బీ నగర్ 

For More News..

త్వరలో నిరుద్యోగ భృతి.. రేపోమాపో కేసీఆర్​ అనౌన్స్​మెంట్