Rest in peace: సాయన్న సంవత్సరీకం జరిగిన మూడో రోజునే లాస్య మరణం.. ఏడాదిలో తండ్రీ, కూతుళ్లు..

Rest in peace: సాయన్న సంవత్సరీకం జరిగిన మూడో రోజునే లాస్య మరణం.. ఏడాదిలో తండ్రీ, కూతుళ్లు..

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో చనిపోవటం ఇప్పుడు అందర్నీ షాక్ గురి చేసింది. దీనికి కారణం లేకపోలేదు.. ఏడాది కాలంగా ఆ కుటుంబంలో వరసగా జరుగుతున్న ఘటనలే ఇందుకు కారణం.. 2023 ఫిబ్రవరి 19వ తేదీ సాయన్న అనారోగ్యంతో చనిపోయారు. నాలుగు రోజుల క్రితమే మొదటి వర్థంతి.. సంవత్సరీకాన్ని పూర్తి చేశారు కుటుంబ సభ్యులు. ఆ సందర్భంగా పలువురు రాజకీయ నేతలు, కార్యకర్తలు సాయన్న ఇంటికెళ్లి నివాళులు అర్పించి వచ్చారు. 

సరిగ్గా ఏడాది.. సాయన్న మరణించి.. ఆయన మొదటి వర్థంతి పూర్తయిన వెంటనే.. 2024లో.. అదే ఫిబ్రవరి నెలలో 23వ తేదీ ఉదయమే సాయన్న కుమార్తె.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో చనిపోవటం యాదృశ్చికమే అయినా.. తండ్రి మరణించిన ఏడాదికి.. అదే నెలలో కుమార్తె తిరిగిరాని లోకానికి వెళ్లటాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు కుటుంబసభ్యులు, అభిమానులు. 

సాయన్న మరణం తర్వాత.. అసెంబ్లీ ఎన్నికల్లో.. బీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగిన లాస్య నందిత.. ఎమ్మెల్యేగా గెలిచారు. తండ్రి సాయన్న లెగసీని కంటిన్యూ చేస్తున్నారని అందరూ అనుకుంటున్న టైంలో.. బోయినపల్లిలోని ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడి లిఫ్ట్ లో చిక్కుకుపోయారు. పై అంతస్తు నుంచి లిఫ్ట్ కింద పడిపోయింది.. అతి కష్టంపై.. గంట తర్వాత లిఫ్ట్ ఓపెన్ చేసి బయటకు తీసుకొచ్చారు. 2023. డిసెంబర్ 24వ తేదీన ఈ ఘటన జరిగింది. 

ఆ తర్వాత నల్గొండలో కేసీఆర్ సభలో పాల్గొని వస్తున్న సమయంలో ఎమ్మెల్యే లాస్య కారుకు యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ లో కారుకు డ్యామేజ్ అయినా.. ఎమ్మెల్యే లాస్య మాత్రం ఎలాంటి గాయాలు లేకుండా బయటపడింది. ఇటీవల కాలంలో అనారోగ్యం బారిన కూడా పడింది లాస్య. హై ఫీవర్ తో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంది. 

తండ్రి సాయన్న సంవత్సరీకం ముగిసిన మూడో రోజునే.. లాస్య కారు ప్రమాదంలో చనిపోవటంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుపుముకున్నాయి. కంటోన్మెంట్ ప్రజలు, కార్యకర్తలు, నేతలు అయితే.. మొన్ననే అన్నకు ఘనంగా నివాళులర్పించాం.. ఇంతలోనే అన్న కుమార్తె.. ఎమ్మెల్యేకు నివాళులు అర్పించాల్సిన దుస్థితి వచ్చింది అంటూ కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు.