లతా మంగేష్కర్ చివరిగా పాడిన పాట ఇదే

లతా మంగేష్కర్ చివరిగా పాడిన పాట ఇదే

లెజండరీ సింగర్, భారత గాన కోకిల లతా మంగేష్కర్ ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఆమె అమృతమయ గాత్రం మూగబోయింది. మన దేశ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ‘భారత రత్నాన్ని’ కరోనా బలి తీసుకుంది. ఆమె మరణ వార్త తెలిసి దేశంలో ప్రతి హృదయం విషాదంలో మునిగిపోయింది. ఆమె గాత్రం ముగబోయిందే కానీ, పాట రూపంలో మన మధ్య ఆమె ఎల్లప్పుడూ సజీవంగానే ఉంటారని ప్రధాని మోడీ తన సంతాప ప్రకటనలో చెప్పారు. లతాజీ మరణం తన హృదయాన్ని కలచివేసిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ప్రముఖ రాజకీయ వేత్తలు, సినిమా సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ లతా మంగేష్కర్ మరణంపై సోషల్ మీడియాలో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

చివరిగా రికార్డ్ చేసిన పాట..

లతా మంగేష్కర్‌‌కు గొప్ప పేరు తెచ్చిన పాటలు ఎన్నో ఉన్నాయి. ఆమె గాత్రంలో పాటల ప్రవాహానికి ఎన్నో అవార్డులు వెంట వచ్చాయి. అప్పటికే ఆమె సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న సమయంలో భారత్, చైనాల మధ్య జరిగిన యుద్ధం తర్వాత పాడిన ‘‘ఏ మేరే వతన్‌ కే లోగో’’ పాట నాటి భారత ప్రధాని జవహర్‌‌ లాల్ నెహ్రూతో కంటతడి పెట్టించింది. భారత గాన కోకిలగా పేరు తెచ్చుకున్న ఆమె గాత్రంలో చివరిగా పలికిన పాట.. గాయత్రి మత్రం కావడం విశేషం.

ఎవరి కోసం..

2018 డిసెంబర్‌‌ 12న రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, నీతూ అంబానీ దంపతుల కమార్తె ఇషా అంబానీకి ఆనంద్ పరిమళ్‌తో పెళ్లి అవుతున్న సందర్భంలో ఆ నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ గాయత్రి మంత్రాన్ని రికార్డ్ చేసి పంపారు లతా మంగేష్కర్. ఆమె పాడిన గాయత్రి మంత్రంతో పాటు కొత్త జంటకు అభినందనలు చెప్పిన ఆడియోను ఆ వివాహ మండపంలో ప్లే చేశారు. నాడు సింగిల్‌ టేక్‌లోనే ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో గాయత్రి మంత్రాన్ని ఆలాపించారని రికార్డ్‌ టీమ్‌లోని ఒకరు చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

రేపు పబ్లిక్ హాలిడే ప్రకటించిన రెండు రాష్ట్రాలు

లతా మంగేష్కర్ తెలుగులో పాడిన పాటలు ఇవే

రోజూ నిద్రలేవగానే లతా దీదీ మొఖమే చూసేవాడ్ని