తెలుగులో లత ఏం పాటలు పాడిందంటే..

తెలుగులో లత ఏం పాటలు పాడిందంటే..

భారతదేశపు లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ (92) తుదిశ్వాస విడిచారు. కరోనాతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. ఈ ఉదయం 8:12 గంటలకు కన్నుమూశారు. జనవరి 8న కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఆమె ఆరోగ్యం.. మెల్లగా కుదుటపడింది. కానీ, న్యూమోనియా సోకడంతో.. ఒక్కసారిగా పరిస్థితి విషమించి.. వెంటలేటర్ పై ఉంచాల్సి వచ్చింది. చివరకు అనారోగ్యాన్ని జయించలేక తుదిశ్వాస వదిలారు. అభిమానుల సందర్శనార్థం ఆమె మృతదేహాన్ని ముంబైలోని శివాజీ పార్క్‌లో ఉంచనున్నారు. 

లతా మంగేష్కర్ 1947లో మాజ్ బూర్ చిత్రంతో గాయనిగా ప్రస్థానం మొదలుపెట్టారు. లతా ఇప్పటివరకు 980 సినిమాలకు పాటలు పాడారు. 36కి పైగా భారతీయ మరియు విదేశీ భాషలలో 30 వేలకు పైగా పాటలు పాడారు. అయితే ఆమె తెలుగులో మూడు పాటలు మాత్రమే పాడారు. అవేంటంటే.. తెలుగులో 1995లో నాగేశ్వరావు హీరోగా విడుదలైన సంతానం సినిమాలో నిదుర పోరా తమ్ముడా పాట, 1965లో ఎన్టీఆర్ నటించిన దొరికితే దొంగలు సినిమాలో శ్రీ వేంకటేశ పాట, 1988లో నాగార్జున ఆఖరి పోరాటం సినిమాలో తెల్ల చీరకు పాట పాడారు.