గాయని లత మృతితో రెండు రోజులు సంతాప దినాలు

గాయని లత మృతితో రెండు రోజులు సంతాప దినాలు

లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం నిర్వహించనున్నట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. లతా మంగేష్కర్ కరోనాతో ఆస్పత్రిలో చేరి.. చివరి వరకు పోరాడి తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు ముంబైలోని శివాజీ పార్క్‌లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. అంతకుముందు ఆమె మృతదేహాన్ని 12.30 గంటలకు ఆసుపత్రి నుంచి ఆమె నివాసమైన ప్రభు కుంజ్‌కు తీసుకువెళ్లనున్నారు. అక్కడ మధ్యాహ్నం 3 గంటలకు ఆమె పార్థివ దేహాన్ని ఉంచనున్నారు.
 
కాగా.. లతా మంగేష్కర్ స్మారకార్థం రెండు రోజుల పాటు జాతీయ సంతాప దినాలను పాటించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకుగాను ఫిబ్రవరి 6 (ఆదివారం), ఫిబ్రవరి 7 (సోమవారం) రెండు రోజులపాటు మహారాష్ట్రలో సంతాప దినాలను పాటించాలని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

For More News..

లత మరణం గురించి చెప్పలేని వేదనలో ఉన్నాను

రికార్డు సృష్టించిన లతా మంగేష్కర్