ICC T20 Rankings: అన్నింటిలో మనమే నెంబర్ వన్.. ఇంటర్నేషనల్ టీ20 ర్యాంకింగ్స్ లో టీమిండియా క్లీన్ స్వీప్

ICC T20 Rankings: అన్నింటిలో మనమే నెంబర్ వన్.. ఇంటర్నేషనల్ టీ20 ర్యాంకింగ్స్ లో టీమిండియా క్లీన్ స్వీప్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో టీమిండియాకు తిరుగులేకుండా పోతుంది. ఇంటర్నేషనల్ టీ20 ర్యాంకింగ్స్ లో దూసుకెళ్తోంది. ఇక టీ20 ర్యాంకింగ్స్ లో అని విభాగాల్లో ఇండియా ప్లేయర్స్ నెంబర్ వన్ గా ఉండడం విశేషం. దేశాల పరంగా ర్యాంకింగ్స్ లోనూ ఇండియానే టాప్ కావడం విశేషం. టీ20 ర్యాంకింగ్స్ లో బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ విభాగాల్లో మన ప్లేయర్స్ అగ్ర స్థానంలో ఉండడం విశేషం. టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి  టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌‌‌‌లో తొలిసారి నంబర్ వన్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఇండియా మూడో జస్‌‌‌‌ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్  సరసన నిలిచాడు.        

ఆసియా కప్ కు ముందు రెండో స్థానంలో ఉన్న వరుణ్ ఈ మెగా టోర్నీలో తన బౌలింగ్ తో ఒక ర్యాంక్ మెరుగుపర్చుకొని అగ్ర స్థానానికి చేరుకున్నాడు. మార్చి నుంచి టాప్‌‌‌‌లో ఉన్న న్యూజిలాండ్‌‌‌‌ బౌటర్ జాకబ్ డఫీని వెనక్కునెట్టాడు. ఆసియా కప్‌‌‌‌లో  యూఏఈ (1/4), పాకిస్తాన్‌‌‌‌ (1/24)పై అద్భుతంగా రాణించడంతో (సెప్టెంబర్ 17) విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌‌‌‌లో రెండు నుంచి ఒకటో ప్లేస్‌‌‌‌ అందుకున్నాడు. వరుణ్ నెంబర్ వన్ ర్యాంక్ కు చేరుకోవడంతో అన్ని విభాగాల్లో ఇండియా టాప్ ర్యాంక్ ను కైవసం చేసుకున్న తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. 

అగ్ర స్థానాన్ని నిలుపుకున్న అభిషేక్, హార్దిక్ పాండ్య:

టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో అభిషేక్ శర్మ తన నెంబర్ వన్ ర్యాంక్ ను నిలుపుకున్నాడు. రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ ప్లేయర్ పై 46 రేటింగ్ పాయింట్లు ఎక్కువగా ఉండడం విశేషం. 2024 టీ20 వరల్డ్ కప్ సమయంలో సూర్యను అధిగమించి టాప్ కు చేరుకున్న హెడ్.. ఏడాది తర్వాత టీ 20 ఫార్మాట్ లో తన నెంబర్ వన్ ర్యాంక్ ను అభిషేక్ శర్మకు కోల్పోవాల్సి వచ్చింది. టీ20 ఆల్ రౌండర్లు విభాగంలో హార్దిక్ పాండ్య నెంబర్ వన్ ర్యాంక్ లోనే కొనసాగుతున్నాడు. 237 రేటింగ్ పాయింట్లతో పాండ్య ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇక టీమ్స్ ర్యాంకింగ్స్ లో ఇండియా 271 రేటింగ్ పాయింట్లతో టాప్ లో ఉంది.