
కొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టాలో బడ్జెట్ సెషన్ రెండవ భాగాన్ని నిర్వహించే అవకాశం ఉన్నందున భవనం లోపలి ఫోటోలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండగా.. ఈ భవనాన్ని ఈ మార్చిలో ప్రారంభించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్‌లో భాగంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మిస్తోంది. ఇందులో పెద్ద హాళ్లు, లైబ్రరీ, విశాలమైన పార్కింగ్ స్థలంతో పాటు కొన్ని కమిటీ గదులు కూడా ఉన్నాయి. వీటితో పాటు హాళ్లు, కార్యాలయ గదుల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. కాగా దీన్ని 2020 డిసెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. అయితే కొత్త పార్లమెంటు భవనం లోపల ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
లోటస్ థీమ్ - జాతీయ పుష్పంపై రూపొందించిన రాజ్యసభ హాల్ గరిష్టంగా 384 సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ప్రస్తుత పార్లమెంట్ భవనంతో పాటు కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు.
కొత్త పార్లమెంట్ భవనం 65,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది.
పార్లమెంట్ సజావుగా సాగేందుకు కొత్త, ప్రస్తుత భవనాలు సమిష్టిగా పనిచేస్తాయని ప్రభుత్వం తెలిపింది.
కొత్త పార్లమెంట్ భవనంలోని అత్యాధునిక రాజ్యాంగ హాల్
అత్యాధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీతో కొత్త పార్లమెంట్ భవనంలోని కార్యాలయాలు
కొత్త పార్లమెంట్ భవనం
కొత్త పార్లమెంట్ లైబ్రరీ
కొత్త పార్లమెంట్ భవనం అద్భుతమైన దృశ్యం..
ఆధునిక భారతదేశపు వైభవాన్ని, వైవిధ్యాన్ని ప్రతిబింబించే ప్రాంతీయ కళలు, చేతికళతో రూపుదిద్దుకున్న కొత్త పార్లమెంట్ భవనం
వికలాంగులకు అందుబాటులో కొత్త పార్లమెంట్ భవనం
జాతీయ వృక్షం మర్రి చెట్టు ఆకారంలో సెంట్రల్ లాంజ్ కొత్త పార్లమెంట్ భవనంలోని ఓపెన్ కోర్టు యార్డ్.