లతా మరణం తీరని లోటు

లతా మరణం తీరని లోటు
  • లతా మృతిపై ప్రముఖుల సంతాపం
  • ఆమె గానం భావి తరాలకు గుర్తుండిపోతుంది
  • హేమా మాలిని, నితిన్ గడ్కరి, ఉద్ధవ్ ఠాక్రే

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పంతాపం తెలియజేశారు. లతా మరణం భారతీయ చలన చిత్ర పరిశ్రమకి తీరని లోటని, లతా పాడిన పాటలలో నటించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానన్నారు ప్రముఖ నటి, బీజేపి ఎంపీ హేమా మాలిని. లతా చాల ప్రత్యేకమైన వ్యక్తని, ఆమెలా ఎవరు పాడలేరని  కొనియాడారు. లతా మంగేష్కర్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి. దేశం గొప్ప సింగర్ని కోల్పోయిందన్నారు. తన గానం భావి తరాలకు గుర్తుండిపోతుందన్నారు. లతా మంగేష్కర్ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు మంత్రి గడ్కరి  తెలిపారు. లతా మంగేష్కర్ మృతి పట్ల మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంతాపం వ్యక్తం చేశారు. లతా మంగేష్కర్ మృతి తన హృదయాన్ని కలచివేసిందన్నారు. ఒక గొప్ప గాయనిని కోల్పోయామన్నారు. లతా మంగేష్కర్ అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించనున్నట్లు ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. 

ఇవి కూడా చదవండి..

కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉంది...ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. 

ఐదెకరాలలోపు ఉంటెనే రైతుబంధు ఇయ్యాలె