మెడికవర్ క్యాన్సర్ ఇన్‌‌స్టిట్యూట్‌‌లో ట్రూబీమ్ ఐడెంటిఫై రేడియోథెరపీ సిస్టమ్ ప్రారంభం

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌‌స్టిట్యూట్‌‌లో ట్రూబీమ్ ఐడెంటిఫై రేడియోథెరపీ సిస్టమ్ ప్రారంభం

మాదాపూర్, వెలుగు : హైటెక్ సిటీలోని మెడికవర్ క్యాన్సర్ ఇన్‌‌స్టిట్యూట్‌‌లో ట్రూబీమ్ ఐడెంటిఫై రేడియోథెరపీ సిస్టమ్, సర్ఫేస్ గైడెడ్ రేడియోథెరపీ(ఎస్ జీఆర్టీ) మెషీన్ ను మంత్రి హరీశ్​రావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికవర్ హాస్పిటల్స్ దేశంలోనే అత్యుత్తమ ట్రీట్ మెంట్​ను అందిస్తున్నాయన్నారు.  ట్రూబీమ్  ఐడెంటిఫై సిస్టమ్, సర్ఫేస్ గైడెడ్ రేడియోథెరపీతో క్యాన్సర్ పేషెంట్లకు మెరుగైన సేవలు అందించాలనుకోవడం అభినందనీయమన్నారు. 

రేడియేషన్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ వినోద్ మద్దిరెడ్డి మాట్లాడుతూ.. ట్రూబీమ్ ఐడెంటిఫై రేడియోథెరపీ సిస్టమ్ తక్కువ సెషన్లలో పేషెంట్లలో వ్యాధి తీవ్రతను నయం చేయొచ్చన్నారు. కచ్చితత్వంతో తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తో వివిధ రకాలైన రేడియేషన్ ట్రీట్ మెంట్​ను అందించేందుకు ఈ మెషీన్​ను వాడొచ్చన్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ తరహా టెక్నాలజీని మెడికవర్​లో ప్రవేశపెట్టామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ జూలూరి, ఇతర డాక్టర్లు, సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.