World Cup 2025 Final: వారితోనే అసలైన అగ్ని పరీక్ష: ఫైనల్లో సౌతాఫ్రికాతో ఢీ.. ఇండియాను భయపెడుతున్న ఇద్దరు సఫారీ ప్లేయర్స్!

World Cup 2025 Final: వారితోనే అసలైన అగ్ని పరీక్ష: ఫైనల్లో సౌతాఫ్రికాతో ఢీ.. ఇండియాను భయపెడుతున్న ఇద్దరు సఫారీ ప్లేయర్స్!

మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా, సౌతాఫ్రికా తలపడనున్నాయి. ఇప్పటివరకు ఒకసారి కూడా టైటిల్ గెలవని రెండు జట్లు తొలి టైటిల్ కోసం ఆరాటపడుతున్నాయి. ఇండియా ఇప్పటివరకు రెండుసార్లు ఫైనల్ కు వచ్చి ఓడిపోతే.. సౌతాఫ్రికా తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకుంది. ఈ రెండు జట్లు తుది సమరానికి చేరుకోవడంతో మ్యాచ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు జట్లు బలంగా ఉండడంతో విజేతను అంచనా వేయడం కష్టంగా మారుతుంది. ఆదివారం (నవంబర్ 2) ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో ఫైనల్ జరగనుంది. 

సౌతాఫ్రికాకు ఆ ఇద్దరే బలం:

లారా వోల్వార్డ్ట్ అసాధారణ నిలకడ: 

సౌతాఫ్రికా జట్టులో ఇద్దరు మ్యాచ్ విన్నర్లను ఆపకపోతే ఇండియా ఫైనల్లో గెలవడం కష్టం. వారిలో ఒకరు కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ కాగా మరొకరు ఆల్ రౌండర్ మారిజాన్ కాప్. వోల్వార్డ్ట్ ఇంగ్లాండ్ పై జరిగిన సెమీ ఫైనల్లో భారీ సెంచరీతో విరుచుకుపడింది.  బుధవారం (అక్టోబర్ 29) గౌహతి వేదికగా  బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ సెమీస్ పోరులో వోల్వార్డ్ట్ నెక్స్ట్ లెవల్ ఇన్నింగ్స్ ఆడుతూ 169 పరుగులు చేసి మారథాన్ ఇన్నింగ్స్ ఆడింది. ఒక్కసారి క్రీజ్ లో కుదురుకుంటే ఈ సఫారీ కెప్టెన్ ను ఆపడం కష్టం. ఫైనల్లో టీమిండియా  వోల్వార్డ్ట్ ను ఆపకపోతే విజయం కష్టమవుతోంది. 

మారిజాన్ కాప్ ఆల్ రౌండ్ షో :

సౌతాఫ్రికా ఆల్ రౌండర్ మారిజాన్ కాప్ సూపర్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉంది. అటు కొత్త బంతితో బౌలింగ్ చేసే కప్.. మిడిల్ ఓవర్స్ లో కీలక ఇన్నింగ్స్ ఆడుతూ జట్టును నిలబెడుతుంది. నిలకడగా ఆడుతూ తన అనుభవాన్ని చూపిస్తుంది. ఈ టోర్నీలో టాప్ ఫామ్ లో ఉన్న కప్ టీమిండియాకు అగ్ని పరీక్షగా మారనుంది. బ్యాటింగ్ లో నిలబడితే భారీ ఇన్నింగ్స్ లు ఆడగలదు. బౌలింగ్ లో తన స్వింగ్ తో వణికించగలదు. సెమీస్ లో కప్ అద్భుత ప్రదర్శన చేసింది. మొదట బ్యాటింగ్ లో 42 పరుగులు చేసిన ఈ సఫారీ ఆల్ రౌండర్.. ఆ తర్వాత బౌలింగ్ లో ఏకంగా 5 వికెట్లు పడగొట్టి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసింది.