ఈ అందాల రాక్షసి ముందే చెప్పింది.. 12 ఏళ్ళ తరువాత అదే నిజమైంది

ఈ అందాల రాక్షసి ముందే చెప్పింది.. 12 ఏళ్ళ తరువాత అదే నిజమైంది

అందాల రాక్షసి(Andala rakshasi) లావణ్య త్రిపాఠి(Lavanya tripathi) ఇప్పుడు మెగా ఇంటికి కోడలు అయ్యారు. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న వరుణ్(Varun), లావణ్య జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. నవంబర్ 1న ఈ ఇద్దరు మొదటిసారి కలుసుకున్న ప్లేస్ ఇటలీలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ పెళ్లి జరిగింది. పెళ్ళికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. 

అయితే తాజాగా లావణ్య త్రిపాఠికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందాల రాక్షసి సినిమాతో లావణ్య టాలీవుడ్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. హను రాఘవపూడి(Hanu raghvapudi) దర్శకత్వంలో 2012లో రిలీజైన ఈ సినిమా క్లాస్ మూవీగా ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది. అయితే ఈ సినిమాలోని ఒక్క సన్నివేశంలో లావణ్యని నీ పెళ్ళికి చిరంజీవి(Chiranjeevi) కూడా వస్తారా అని చిన్న పిల్లలు అడుగుతారు.. దానికి అవునని తల ఊపుతుంది లావణ్య. సరిగా 12 ఏళ్ళ తరువాత అదే జరిగింది. తన పెళ్లికి చిరంజీవి రావడం కాదు.. చిరంజీవి ఇంటి కుర్రాడినే ఆమె పెళ్లిచేసుకుంది. దీంతో ఈ వీడియోను తెగ ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్స్. 

ఆ మధ్య నిర్మాత  అల్లు అరవింద్(Allu aravind) కూడా లావణ్య పెళ్లి గురించి కామెంట్స్ చేశారు. ఓ సినిమా ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ.. ఒక తెలుగబ్బాయిని పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అయిపో అన్నారు. అది కూడా జరిగింది. ఆమె తెలుగబ్బాయిని పెళ్లి చేసుకొనే ఇక్కడే సెటిల్ అయ్యింది. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.