హీరోయిన్పై తప్పుడు కేసు..సిమెంట్ బ్రిక్స్ అపార్ట్మెంట్లోకి ఎలా వచ్చాయ్

హీరోయిన్పై తప్పుడు కేసు..సిమెంట్ బ్రిక్స్ అపార్ట్మెంట్లోకి ఎలా వచ్చాయ్

సినీనటి డింపుల్ హయాతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే వివాదంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వివాదంలో ఇప్పటికే డింపుల్ తో పాటు..అతని స్నేహితుడిపై కూడా కేసులు పెట్టారు. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ  రాహుల్ హెగ్డే కారును డింపుల్ ఢీకొట్టి ధ్వంసం చేశారని..డీసీపీ డ్రైవర్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి సీసీ పుటేజీ కూడా పోలీసులకు సమర్పించారు. అయితే డింపుల్ హయాతిపై తప్పుడు కేసు పెట్టారని డింపుల్ తరపున లాయర్ పాల్ సత్యనారాయణ ఆరోపించారు.

ర్యాష్ గా మాట్లాడారు..

డింపుల్ హయాతిపై కావాలనే తప్పుడు కేసు బనాయించారని లాయర్ పాల్ సత్యనారాయణ తెలిపారు. రోడ్డుపై ఉండే సిమెంట్ బ్రిక్స్ అపార్ట్ మెంట్ లోకి ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రాపర్టీని డీసీపీ మిస్ యూజ్ చేస్తున్నారని అన్నారు. డింపుల్తో డీసీపీ చాలా సార్లు రాష్ గా మాట్లాడారని తెలిపారు. డింపుల్ పార్కింగ్ ప్లేస్ లో కోన్స్ పెట్టారన్న ఆయన.. చాలా సార్లు ఈ విషయాన్ని డీసీపీకి చెప్పినా వినకపోవడంతో అసహనంతో కోన్స్ ని కాలుతో తన్నారని పేర్కొన్నారు. డీసీపీపై డింపుల్ కేసు పెడతానని బెదిరించడంతో.. డింపుల్ పైనే కేసు పెట్టారని తెలిపారు. ఐపీఎస్ తన డ్రైవర్తో కేసు పెట్టించారని చెప్పారు. డింపుల్ కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని లాయర్ పాల్ సత్యనారాయణ తెలిపారు. ఆమెను  4 గంటలు పోలీస్ స్టేషన్ లో కూర్చోపెట్టారని అన్నారు. తాము లీగల్ గా ఫైట్ చేస్తామని పాల్ సత్యనారాయణ వెల్లడించారు.

డింపుల్ ట్వీట్...

మరోవైపు ఈ వివాదంపై హీరోయిన్ డింపుల్ హయాతి ట్వీట్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలపై తన అభిమానుల ఆందోళన అర్థమవుతుందని అన్నారు. మీడియా ఆందోళనను తాను అర్థం చేసుకున్నానని.. వారి సహకారం, మద్దతుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. తాను ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటనలు ఇవ్వలేదని.. అందరూ ఓపికగా వేచి ఉండాలని డింపుల్ ట్వీట్ లో కోరారు.