
ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కేసులో రెండో రోజు న్యాయవాది శ్రీనివాస్ సిట్ విచారణ ముగిసింది. నిన్న ఎనిమిది గంటలకు పైగా విచారణ ఎదుర్కొన్న శ్రీనివాస్.. ఇవాళ మరోసారి విచారణకు హాజరయ్యారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని అతడు విచారణలో చెప్పారు. ఒక పీఠాధిపతికి టికెట్ బుక్ చేస్తే తప్పేంటని అతను వాదించారు. పీఠాధిపతి సింహయజీ స్వామికి ఒక భక్తుడిగా మాత్రమే టికెట్ బుక్ చేశానని శ్రీనివాస్ తెలిపారు. సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తానని శ్రీనివాస్ తెలిపారు. టికెట్ బుక్ చేయడం నేరం కాదని అన్నారు. ఆ టికెట్ ఆధారంగానే తనను రెండు రోజులుగా అధికారులు విచారిస్తున్నారని లాయర్ శ్రీనివాస్ వెల్లడించారు.
బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో శ్రీనివాస్ విచారణ జరిగింది. విచారణలో భాగంగా సిట్ అధికారులు అడిగిన వివరాలను వారికి శ్రీనివాస్ అందజేశారు. మొబైల్ ఫోన్, బ్యాంక్ స్టేట్మెంట్ను సిట్‌కు సమర్పించారు. వాటి ఆధారంగానే అధికారులు శ్రీనివాస్‌ను ప్రశ్నించారు.