సంగారెడ్డి జిల్లాలో చేతికి సంకెళ్లతో న్యాయవాదుల నిరసన

సంగారెడ్డి జిల్లాలో చేతికి సంకెళ్లతో న్యాయవాదుల నిరసన

సంగారెడ్డి టౌన్, వెలుగు: బార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి చేపట్టిన 48 గంటల దీక్షా శిబిరాన్ని పోలీసులు భగ్నం చేయడానికి నిరసిస్తూ శుక్రవారం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. సంకెళ్లతో చేతులు బంధించుకొని కోర్టు ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని అప్పటివరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఆందోళనలో బార్ అసోసియేషన్ నాయకులు భూపాల్ రెడ్డి, మహేశ్, మల్లేశం,  శ్రీకాంత్,  శ్రీనివాస్,  మంజులారెడ్డి,  బుచ్చయ్య, సుభాష్ చంద్ర, నరసింహ, మాణిక్ రెడ్డి, రాములు, దత్తాత్రి, భాస్కర్,  అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

హుస్నాబాద్: న్యాయవాదులపై దాడులను అరికట్టేందుకు కేంద్రం పార్లమెంట్​లో బిల్లు ప్రవేశపెట్టి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని న్యాయవాది కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. నాంపల్లి కోర్టులో న్యాయవాది అనిల్ కుమార్​పై దాడికి నిరసనగా హుస్నాబాద్ న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ఎదుట నిరసన తెలిపారు. కార్యక్రమంలో రామకృష్ణ, జూన్లాల్ నాయక్, దేవేందర్, బాలకిషన్, రవీందర్, రఘువీర్, జ్యోతి, కుమార్, శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, భాస్కర్, సూర్యప్రకాశ్, అజయ్, అరుణ్ తేజ్ పాల్గొన్నారు.