టాలెంట్, స్కిల్స్, మెరిట్ ని  గుర్తించేది కాన్వకేషన్స్

టాలెంట్, స్కిల్స్, మెరిట్ ని  గుర్తించేది కాన్వకేషన్స్

హైదరాబాద్ : టాలెంట్, స్కిల్స్, ప్రతిభను గుర్తించేది కాన్వకేషన్స్ అని OU లా కాలేజీ డీన్ వినోద్ కుమార్ అన్నారు. లాయర్ కోర్సు ఆర్డినరీ డిగ్రీ కాదని, సొసైటీని కాపాడేది లాయర్సే అని అన్నారు. బాగ్ లింగంపల్లిలోని కాకా అంబేడ్కర్ లా కాలేజీలో లా కాలేజీ గ్రాడ్యుయేషన్ సెర్మనీ కార్యక్రమాన్ని మొదటిసారి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు విద్యార్ధులకు మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేశారు. 

ప్రతి ఉద్యోగంలోనూ రిటైర్ మెంట్ ఉంటుంది కానీ..లాయర్ వృత్తిలో ఉండదని రిటైర్డ్ జస్టిస్ రామలింగేశ్వరావు చెప్పారు. న్యాయవాదికే సొసైటీ అంటే ఏంటో తెలుసని, సొసైటీకి సేవ చేసేది లాయరే అన్నారు. మనిషికి డబ్బు సంతృప్తి ఇవ్వదన్న ఆయన..సేవ ఎప్పటికీ సంతృప్తిని ఇస్తుందన్నారు. లాయర్ కమ్యూనిటీలో మీరందరికి ఆహ్వానం ఉంటుందని చెప్పారు. లాయర్ ఎప్పుడు రిటైర్డ్ అవ్వరు.. లాస్ట్ డే వరకు సేవలు చేస్తుంటారని రిటైర్డ్  జస్టిస్ రామలింగేశ్వరావు న్యాయవాదులను కొనియాడారు.

కాలేజీలో ఉన్న బెస్ట్ ఫెసిలిటీస్ ను ఉపయోగించుకుని విద్యార్థులందరూ జీవితంలో అభివృద్ధి చెందాలని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు చెప్పారు. హైదరాబాద్ లో ఎన్నో లా కాలేజీలు సందర్శించానని, కానీ అంబేద్కర్ కాలేజీలో ఉన్న ఫెసిలిటిస్, మంచి గ్రౌండ్ ఎక్కడ లేవని రామచంద్రరావు తెలిపారు. అంబేద్కర్ లా కాలేజ్ ఇండియాలో టాప్ లిస్ట్ లో ఉందన్న ఆయన ఈ రోజుల్లో లా కి మంచి డిమాండ్ ఉందన్నారు. స్టూడెంట్స్ లా కోర్స్ ను సీరియస్ తీసుకుంటున్నారని, సొసైటీపై ఫైట్ చేసేది లా అని తెలిపారు. ఇండియాలో ఉన్నంత అడ్వాకేట్స్ ఎక్కడ లేరని, 18 లక్షలకు పైగా అడ్వకేట్స్ మన దేశంలో ఉన్నారని తెలిపారు. లైఫ్ ని ఎంజాయ్ చేయాలంటే హార్డ్ వర్క్ చేయాలని, లా గ్రాడ్యుయేట్ అందరికి  అల్ ది బెస్ట్ తెలిపారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు.

అంబేడ్కర్ కాలేజీలో చదవడం తన అదృష్టమని టెబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ నైనా జైస్వాల్‌ సంతోషం వ్యక్తం చేశారు. కాలేజీలో ఫస్ట్ టైమ్ జరిగిన గ్యాడ్యుయేషన్ సెర్మనీలో కరస్పాండెంట్ సరోజ  వివేక్, జాయింట్ సెక్రటరీ రమణ కుమార్, లా కాలేజీ  ఫ్యాకల్టీ పాల్గొన్నారు.