ఒత్తిడిలోనూ కూల్​గా ఉంటాడు

ఒత్తిడిలోనూ కూల్​గా ఉంటాడు

రోహిత్‌‌పై లక్ష్మణ్‌‌ ప్రశంసలు

న్యూఢిల్లీ: ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండటం.. క్లిష్ట సమయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే.. ఐపీఎల్‌‌లో కెప్టెన్‌‌గా రోహిత్ శర్మ సక్సెస్‌‌ అయ్యాడని హైదరాబాద్‌‌ స్టయిలిష్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ వీవీఎస్‌‌ లక్ష్మణ్‌‌ ప్రశంసించాడు. డెక్కన్‌‌ చార్జర్స్‌‌కు ఆడినప్పట్నించి.. ముంబై ఇండియన్స్‌‌కు నాలుగు టైటిల్స్‌‌ అందించడం వరకు రోహిత్‌‌ ఎదిగిన తీరు అద్భుతమని కితాబిచ్చాడు. ‘డెక్కన్‌‌ చార్జర్స్‌‌కు ఆడుతున్నప్పుడే రోహిత్‌‌ నాయకుడిగా ఎదిగాడు. ఫస్ట్‌‌ ఐపీఎల్‌‌ అప్పుడు అతను ఓ కుర్రాడు. టీమిండియాలోకి అరంగేట్రం చేసి కేవలం టీ20 వరల్డ్‌‌కప్‌‌ మాత్రమే ఆడాడు.  అయితే 2008 స్టార్టింగ్‌‌ ఐపీఎల్‌‌లో డీసీ బాగా ఆడలేదు. కానీ రోహిత్‌‌ ఆకట్టుకున్నాడు. ఎంత ఒత్తిడి ఉన్నా మిడిలార్డర్‌‌లో బాగా రన్స్‌‌ చేసేవాడు’ అని లక్ష్మణ్‌‌ గుర్తు చేశాడు. టీమ్‌‌ అవసరాన్ని బట్టి ఓపెనర్‌‌, మిడిలార్డర్‌‌ ఎక్కడైనా ఆడేందుకు ఈ ముంబైకర్‌‌ సిద్ధంగా ఉంటాడన్నాడు. ‘ప్రతి మ్యాచ్‌‌కు, ప్రతి విజయానికి రోహిత్‌‌లో ఆత్మవిశ్వాసం పెరిగేది. కోర్‌‌ గ్రూప్‌‌లో మెంబర్‌‌ అయ్యాక.. యంగ్‌‌స్టర్స్‌‌కు సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేవాడు. ఓ నాయకుడిగా ఎదగడానికి ఇవన్నీ ముందస్తు లక్షణాలు. నా వరకైతే ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండటమే కీలకం’ అని లక్ష్మణ్‌‌ వివరించాడు.

For More News..

50కి పైగా కేసుల్లో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

విద్యార్థులకు శుభవార్త.. ఎగ్జామ్స్ లేకుండానే  ప్రమోట్

తల్లిదండ్రులు భార్యను వేధిస్తున్నారని.. ఆమెతో కలిసి సూసైడ్ చేసుకున్న భర్త

కరోనా గురించి మామను కోల్పోయిన అల్లుడి సోషల్ మీడియా పోస్ట్