మంత్రి ఉత్తమ్​కు రాహుల్ సంతాప లేఖ

మంత్రి ఉత్తమ్​కు రాహుల్ సంతాప లేఖ

న్యూఢిల్లీ, వెలుగు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృవియోగం పట్ల లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి మరణ వార్త తెలిసి మూడు రోజుల క్రితం రాహుల్ గాంధీ ఉత్తమ్ ను ఫోన్లో‌‌‌‌ పరామర్శించారు. తాజాగా పురుషోత్తమ్ రెడ్డి మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ మంత్రి ఉత్తమ్ కు రాహుల్ సంతాప లేఖ పంపారు. బాధలో ఉన్న ఉత్తమ్ కుటుంబానికి  ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు రాహుల్ తన లేఖలో పేర్కోన్నారు.