V6 News

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ..పార్టీ మద్దతుదారుల కోసం లీడర్ల ప్రచారం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ..పార్టీ మద్దతుదారుల కోసం లీడర్ల ప్రచారం

జయశంకర్​భూపాలపల్లి/ నెల్లికుదురు/ పర్వతగిరి/ వర్ధన్నపేట (ఐనవోలు), వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులకు పలువురు ప్రజాప్రతినిధులు ప్రచారం చేశారు. సోమవారం జయశంకర్​ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని పలువురు సర్పంచ్​ అభ్యర్థుల ప్రచారంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. 

అంతకుముందు క్యాంప్​ ఆఫీస్​లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయా గ్రామాల సర్పంచ్​లను సన్మానించారు. మహబూబాబాద్​ జిల్లా నెల్లికుదురు మండలం  మేచిరాజుపల్లి, ఎర్రబెల్లి గూడెం, కాచికల్, రామన్నగూడెం, బ్రాహ్మణ కొత్తపల్లి, నైనాల, రతి రామ్ తండాతోపాటు పలు గ్రామాల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్​ ప్రచారం చేశారు.

 వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలం గోపనపెల్లి, అనంతారం, వడ్లకొండ, రోళ్లకల్లు, నారాయణపురం, శ్రీనగర్​, పెద్దతండా, అన్నారం, రావూర్​, పర్వతగిరి గ్రామాల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్​ నాగరాజు మద్దతుదారుల తరఫున ప్రచారం నిర్వహించారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి తరఫున రాష్ర్ట కో ఆపరేటీవ్​ అపెక్స్​ బ్యాంక్​ చైర్మన్​ మార్నేని రవీందర్​రావు ప్రచారం చేశారు. పార్టీ తరఫున నిలిపిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.