ఢిల్లీలో CWC మీటింగ్ : రాహుల్ రాజీనామాపై చర్చ!

ఢిల్లీలో CWC మీటింగ్ : రాహుల్ రాజీనామాపై చర్చ!

ఢిల్లీ : AICC కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, పార్టీ సీనియర్ నాయకులు గులాంనబీ ఆజాద్, ఏకే ఆంటోనీ, చిదంబరం, మోతిలాల్ హోరా, సీడబ్ల్యూసీ సభ్యులు, రాష్టాల పీసీసీ ప్రెసిడెంట్లు ,సీఎల్పీ నేతలు పాల్గొన్నారు.

సార్వత్రిక ఎన్నికల ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేయబోతున్నారంటూ వచ్చిన వార్తలతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్ నైతిక బాధ్యతగా రాజీనామా చేసినా.. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన సీడబ్ల్యూసీ దానిని తిరస్కరిస్తుందని పార్టీ నేతలు చెప్పారు.

లోక్ సభ ఎన్నికల సందర్భంగా 115 చోట్ల రాహుల్ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. 17 శాతం గెలుపు దక్కగా, 83 శాతం పరాజయాలు ఎదురయ్యాయి. మరోవైపు ఇలాంటి కీలక సమయంలో రాహుల్ తప్పుకుంటే.. ఆ స్థాయిలో వాయిస్ వినిపించే నాయకుడు ఎవరన్నది కీలకంగా మారింది.  అయితే రాహులే కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగాలంటూ సీడబ్ల్యూసీ నేతలు కోరినట్లు తెలిసింది.