ఆ 2 వేల ఎకరాలపై లీడర్ల కన్నువడ్డది

ఆ 2 వేల ఎకరాలపై లీడర్ల కన్నువడ్డది

మహబూబాబాద్​, వెలుగు: ​మహబూబాబాద్​లోని 551 సర్వే నంబర్​లో 2 వేల ఎకరాల భూ ములను గతంలో  పేదలకు అసైన్​ చేశారని, కానీ ఈ భూములపై రాజకీయ నేతల కన్నుపడిందని బీజేపీ నేత, హుజూరాబాద్​ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ అన్నారు. ఎస్వీఎం ఫంక్షన్​హాల్​లో బుధవారం ఆయన మాట్లాడుతూ  జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారికి పరిహారం చెల్లించాలన్నారు. శనగపురంలో 45 ఎకరాల భూమిని బినామీ పేర్లతో కొంతమంది రాజకీయ నాయకులు కొన్నారన్నారు. కౌన్సిలర్ రవి నాయక్​ ఇది అన్యాయమని కొట్లాడితే అతన్ని హత్య చేశారని, మర్డర్ పై సమగ్ర విచారణ జరిపించి దోషులను శిక్షించాలన్నారు. జిల్లాలో ఇనుగుర్తి మండలాన్ని ఏర్పాటు చేయాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రావు,  నాయకులు యాప సీతయ్య,  సంపత్,  శ్రీనివాస్,  శశివర్ధన్ రెడ్డి,  వెంకటేశ్వర్లు,  నవీన్ , ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.  
 

అమిత్​షా సభను సక్సెస్​చేయాలి
జనగామ : బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఈనెల 14న నిర్వహించనున్న భారీ బహిరంగసభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా వస్తున్నారని, ఈ సభను విజయవంతం చేయాలని ఈటల కోరారు. బుధవారం జనగామలోని బీజేపీ జిల్లా పార్టీ ఆఫీస్ లో మాట్లాడుతూ ల్యాండ్​ పూలింగ్​ పేరుతో సీఎం కేసీఆర్ ​రియల్​ఎస్టేట్​బ్రోకర్ అవతారం ఎత్తిండన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్​రెడ్డి, రాష్ర్ట లీడర్లు కేవీఎల్​ఎన్​ రెడ్డి, మాదాసు వెంకటేశ్, ముక్కెర తిరుపతి రెడ్డి, రమేశ్, హరిశ్చంద్ర, సౌడ రమేశ్, శివరాజ్​, బీరప్ప పాల్గొన్నారు.