
బషీర్ బాగ్, వెలుగు: గోషామహల్ బీఆర్‌ఎస్ టికెట్‌ను తెలంగాణ ఉద్యమకారులకే ఇవ్వాలని గోషామహల్ ట్రేడర్స్ అసోసియేషన్ నేతలు సీఎం కేసీఆర్ ను కోరారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఫ్లైవుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీశ్ రెడ్డి మాట్లాడుతూ... ఉద్యమకారుడు బిజిని శ్రీనివాస్ కు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని కోరారు.
గోషామహల్ టికెట్ శ్రీనివాస్‌కు ఇస్తే ఆయన్ను గెలిపిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గోషామహల్ ట్రేడర్స్ అసోసియేషన్ నాయకులు రమేశ్ అసోవా, దినేశ్ బండారీ, ప్రసాద్, ఎం. కృష్ణ , ప్రవీణ్ గుప్త , రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.