గవర్నర్ను కలిసిన వీహెచ్పీ, గణేశ్ ఉత్సవ్ సమితి నేతలు

గవర్నర్ను కలిసిన వీహెచ్పీ, గణేశ్ ఉత్సవ్ సమితి నేతలు

హైదరాబాద్: రాష్ట్రాన్ని ఎంఐఎం పాలిస్తోందని వీహెచ్పీ,  భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ్ సమితి నేతలు ఆరోపించారు. శక్రవారం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసైని కలిసిన విశ్వహిందూ పరిషత్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు... నగరంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు కలిసి కావాలనే నగరంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అమాయకులను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్రానికి ఉన్నది ఉన్నట్టుగా నివేదిక ఇవ్వాలని గవర్నర్ ను కోరామన్నారు. 4వేల మంది పోలీసులతో మునవార్ షో నిర్వహించడం అవసరమా అని ప్రశ్నించారు. వినాయక చవితి ప్రశాంతంగా జరగకుండా ఉండేందుకు కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.