ప్రొ. జయశంకర్, మారోజు వీరన్న శ్రీకాంత చారి పోరాటాలతోనే తెలంగాణ ఏర్పాటు

 ప్రొ. జయశంకర్, మారోజు వీరన్న శ్రీకాంత చారి పోరాటాలతోనే తెలంగాణ ఏర్పాటు

కల్వకుర్తి నియోజకవర్గ నేతలు టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా కేటీఆర్ చేసిన కొన్ని కామెంట్స్ పై విశ్వబ్రాహ్మణ సంఘాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సామాజిక వర్గానికి చెందిన టీఆర్ఎస్ లీడర్లు కూడా కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఎల్బీనగర్, మీర్ పేట్, కామారెడ్డి లలో కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. శ్రీకాంత చారి బలిదానంతోనే తెలంగాణ ఏర్పాటు దిశగా అడుగులు పడ్డాయని, అలాంటి సామాజిక వర్గాన్ని కించపరిస్తే సహించేది లేదంటున్నారు. కేటీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. చారిలు పప్పులు కాదు నివురుగప్పిన నిప్పులు , సమాజ సంస్కృతి నిర్మాతలు అని దాసోజ్ శ్రవణ్ అన్నారు. పోరాటానికి తిరుగుబాటుకు, త్యాగాలకు, విశ్వసనీతయకు మారు పేర్లు అని శ్రవణ్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్, మారోజు వీరన్న శ్రీకాంత చారి పోరాట ఫలితమే తెలంగాణ ఏర్పాటు అని అన్నారు శ్రవణ్. 

కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాష్ట్ర విశ్వబ్రహ్మణ సంఘం నేతలు. తమ జాతిని కించపరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాము కూడా టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారమే అన్నారు. గతంలో కూడా కేటీఆర్ ఇలానే కామెంట్ చేశారని ఆరోపించారు. ఎల్బీనగర్, మీర్ పేట్ లో మంత్రి కేటీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు విశ్వబ్రహ్మణులు. విశ్వబ్రహ్మణులకు క్షమాపణలు చెప్పకపోతే ఆందోళన ఉదృతం చేస్తామన్నారు. శ్రీకాంత చారి బలిదానం చేసుకుంటే కేటీఆర్, కేసీఆర్ పాలిస్తున్నారని విమర్శించారు. 

కేటీఆర్ కామెంట్స్ ను నిరసిస్తూ జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్ పల్లిలో విశ్వబ్రాహ్మణులు ఆందోళన చేశారు. కోరుట్లలో కేటీఆర్ ఫొటోకు చెప్పుల దండ వేశారు. అనంతరం దిష్టిబొమ్మ దగ్దం చేశారు. మెట్ పల్లిలో  స్థానిక బ్రహ్మంగారి ఆలయం నుంచి పోలీస్ స్టేషన్ దాకా ర్యాలీ చేశారు. అక్కడ కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు. వెంటనే విశ్వబ్రాహ్మణులకు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.