చెరువుల్ని అధికార పార్టీ నేతలు కబ్జా చేస్తున్నరు

చెరువుల్ని అధికార పార్టీ నేతలు కబ్జా చేస్తున్నరు
  • అధికారులు వారికే వత్తాసు పలుకుతున్నరు: బక్క జడ్సన్​
  • చెరువుల బఫర్​ జోన్లను గుర్తించాలని సీఎస్​కు విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం 25 ఎకరాలలోపు విస్తీర్ణం ఉన్న చెరువులకు 9 మీటర్లు, 25 ఎకరాల కన్నా ఎక్కువుండే చెరువులకు 30 మీటర్ల వరకు బఫర్​ జోన్​ ఉండాలని, ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతివ్వొద్దని కాంగ్రెస్​ నేత, ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్​ అన్నారు. కానీ, అధికార పార్టీ నేతల అండతో రియల్టర్లు, బిల్డర్లు చెరువులను పూడ్చేసి వెంచర్లు వేస్తున్నారని ఆరోపించారు. 
 
కాబట్టి రాష్ట్రంలోని అన్ని చెరువులు, నీటి వనరుల బఫర్​ జోన్​లను గుర్తించి నోటిఫై చేయాలని మంగళవారం ఆయన సీఎస్​ శాంతికుమారికి వినతి పత్రం ఇచ్చారు. అధికారులు కూడా అక్రమార్కులకే వత్తాసు పలుకుతున్నారన్నారువరంగల్​ నగరం చుట్టుపక్కల కాకతీయులు 202 గొలుసుకట్టు చెరువులు కట్టారని, కానీ, వాటిని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటిదాకా 52 చెరువులు, కుంటలను మాయం చేశారన్నారు. 

 ఎర్రబెల్లిపై మానవ హక్కుల కమిషన్​కు ఫిర్యాదు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావుపై జాతీయ మానవ హక్కుల కమిషన్​కు జడ్సన్​ ఫిర్యాదు చేశారు. ఏప్రిల్​ 3న పత్తిపాకలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో.. గ్రామ పంచాయతీలు ఖాళీ మందు బాటిళ్లను సేకరించి ఆదాయం పెంచుకోవాలని మంత్రి మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు.