
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ఏఐ చాట్‌బాట్ గ్రోక్ కొంపముంచింది. దాదాపు 3 లక్షల 70 వేల మంది గ్రోక్ వినియోదారుల చాట్ ఇంటర్నెట్లో లీక్ అయ్యింది. యూజర్ల పర్సనల్ చాట్ గూగుల్ వంటి మరికొన్ని సెర్చ్ ఇంజిన్లలో బహిరంగంగా అందుబాటులో ఉంది. గ్రోక్ వినియోగదారుల చాట్ లీక్ విషయాన్ని టెక్ పరిశ్రమ ప్రచురణ సంస్థ ఫోర్బ్స్ నివేదించింది. పోర్స్ నివేదిక ప్రకారం.. గ్రోక్ చాట్ బాట్లోని షేర్ ఆప్షన్ వల్ల ఈ డేటా లీక్ అయ్యింది. గ్రోక్ యూజర్లు వారి చాట్‌లలో షేర్ బటన్‌ను క్లిక్ చేయడంతో ఆ సంభాషణలు నేరుగా పబ్లిక్ వెబ్‌పేజీకి వెళ్లిపోయాయి.
దీంతో వినియోగదారుల వ్యక్తిగత సంభాషణ గూగుల్, బింగ్, డక్ డక్ గో వంటి సెర్చ్ ఇంజిన్లలో ప్రత్యక్షమైంది. వైద్య, ఆరోగ్య, మానసిక ప్రశ్నలు, వ్యాపార వివరాల వంటి వినియోగదారుల సున్నితమైన చాట్ సెర్చ్ ఇంజిన్లలో బహిర్గతం అయ్యాయి. లీక్ అయిన డేటా ప్రకారం.. ఒక యూజర్ క్లాస్ A డ్రగ్‌ను ఎలా తయారు చేయాలో అడగగా.. ఇందుకు గ్రోక్ వివరంగా ఆన్సర్ ఇచ్చింది. మరో యూజర్ ఎలోన్ మస్క్‌ను హత్య చేయడం గురించి ప్రశ్నించగా.. తీరిగ్గా సమాధానిమిచ్చింది. ఇంకొక యూజర్‌కు ఆత్మహత్య కు ప్రేరేపించే సమాధాలు చెప్పింది.
Also read:-ఢిల్లీలో మెట్రో రైలు ఛార్జీలు పెరిగినయ్.. హైదరాబాద్తో పోల్చితే.. ఎక్కువా..? తక్కువా..?
దీంతో మస్క్ గ్రోక్ చాట్ బాట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రోక్ వినియోగదారుల వ్యక్తిగత గోప్యతపై మరోసారి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తమ చాట్ లీక్ కావడంతో గ్రోక్‌పై మండిపడుతున్న యూజర్స్. అయితే.. గతంలో ఓపెన్ ఏఐ చాట్ బాట్ కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది. ఓపెన్ ఏఐ వినియోగదారుల చాట్ కూడా ఇంటర్నెట్లో ప్రత్యక్షమైంది. వినియోగదారుల ఆందోళనలు లేవనెత్తడంతో ఓపెన్ ఏఐ తన షేర్ ఫీచర్‌ను రద్దు చేసింది. ఈ పరిణామాలను AI చాట్‌బాట్‌లను గోప్యతా విపత్తు పురోగతిలో ఉందని అభివర్ణించారు ఒక ఏఐ నిపుణుడు.