ఢిల్లీలో మెట్రో రైలు ఛార్జీలు పెరిగినయ్.. హైదరాబాద్తో పోల్చితే.. ఎక్కువా..? తక్కువా..?

ఢిల్లీలో మెట్రో రైలు ఛార్జీలు పెరిగినయ్.. హైదరాబాద్తో పోల్చితే.. ఎక్కువా..? తక్కువా..?

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 2017 తర్వాత మరోసారి మెట్రో రైలు ఛార్జీలు పెరిగాయి. ఎనిమిదేళ్ల తర్వాత ఢిల్లీలో మెట్రో రైలు ఛార్జీలు పెంచడం గమనార్హం. ఆగస్ట్ 25 (సోమవారం) నుంచి ఢిల్లీ మెట్రో రైళ్లలో పెంచిన టికెట్ ధరలు అమల్లోకి వస్తాయని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ‘ఎక్స్’లో ట్వీట్ చేసింది. దూరాన్ని బట్టి ఒక రూపాయి నుంచి నాలుగు రూపాయల వరకూ మెట్రో రైలు ఛార్జీలను ఢిల్లీ మెట్రో పెంచింది.

0-2 కిలోమీటర్ల వరకూ నిన్నటి దాకా 10 రూపాయలు ఉండగా, ఇకపై 11 రూపాయలు, 2-5 కిలోమీటర్లకు 20 రూపాయలు ఉండగా 21 రూపాయలు, 5-12 కిలోమీటర్లకు ఇన్నాళ్లూ 30 రూపాయలు ఉండగా ఇకపై 32 రూపాయలు, 12-21 కిలోమీటర్లకు 40 రూపాయలు ఉండగా 43 రూపాయలకు, 21-32 కిలోమీటర్లకు 50 రూపాయల నుంచి 54 రూపాయలు, 32 కిలోమీటర్లకు మించి దూరం ఉంటే 60 నుంచి 64 రూపాయలకు ఢిల్లీ మెట్రో రైల్ టికెట్ ఛార్జీలను పెంచారు.

ఒక్కముక్కలో చెప్పాలంటే.. ఢిల్లీలో మెట్రో రైలు టికెట్ ధరలు పెంచాక మినిమమ్ ఛార్జ్ 11 రూపాయలు, అత్యధిక ఛార్జీ 64 రూపాయలు. అయితే.. స్మార్ట్ కార్డ్స్తో ఢిల్లీ మెట్రోలో ప్రయాణం చేసే వారికి టికెట్ రేట్ల పెంపుతో సంబంధం లేకుండా గతంలో మాదిరిగానే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుందని ఢిల్లీ మెట్రో స్పష్టం చేసింది. ఢిల్లీలో ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్లో ప్రయాణం చేసేవారికి 5 రూపాయల దాకా టికెట్ ధరపై పెంపు ఉంటుందని ఢిల్లీ మెట్రో తెలిపింది. హైదరాబాద్ మెట్రోలో హయ్యెస్ట్ ఛార్జీ 69 రూపాయలు కావడం గమనార్హం.

Also read:-కొంపముంచిన మస్క్ గ్రోక్ చాట్‏బాట్.. గూగుల్‎లో 3 లక్షల 70 వేల మంది చాట్ లీక్..!

హైదరాబాద్ మెట్రో రైలు ధరల వివరాలు: 
* రెండు కిలోమీటర్ల వరకు 11 రూపాయలు
* 2 నుంచి 4 కిలోమీటర్ల వరకు 17 రూపాయలు
* 4 నుంచి 6 కిలోమీటర్ల వరకు 28 రూపాయలు
* 6 నుంచి 9 కిలోమీటర్ల వరకు 37 రూపాయలు
* 9 నుంచి 12 కిలోమీటర్ల వరకు 47 రూపాయలు
* 12 నుంచి 15 కిలోమీటర్ల వరకు 51 రూపాయలు
* 15నుంచి 18 కిలోమీటర్ల వరకు 56 రూపాయలు
* 18నుంచి 21 కిలోమీటర్ల వరకు 61 రూపాయలు
* 21 నుంచి 24 కిలోమీటర్ల వరకు 65 రూపాయలు
* 24 నుంచి ఆపై కిలోమీటర్ల కు 69 రూపాయలు