హోంలోన్ EMI తగ్గించడానికి ఐదు దారులు

హోంలోన్ EMI  తగ్గించడానికి ఐదు దారులు

బిజినెస్​ డెస్క్​, వెలుగు: హోంలోన్ తీసుకోవడం చాలా ముఖ్యమైన నిర్ణయం. ఎందుకంటే దీనిని దాదాపు 20 ఏళ్ల దాకా కట్టాలి. ఆదాయంలో ఎక్కువ మొత్తం కిస్తీలకే పోతుంది. అయితే మీరు తగినంత కష్టపడకపోతే మంచి హోంలోన్ దొరక్కపోవచ్చు. వడ్డీభారం ఎక్కువగా ఉండొచ్చు.  అన్నింటికంటే ముఖ్యమైన విషయం తక్కువ వడ్డీ ఇవ్వగల బ్యాంక్‌‌‌‌ను ఎంచుకోవడం. మీ ఫైనాన్షియల్ ప్రొఫైల్‌‌‌‌కు తగ్గ బ్యాంకును పట్టుకోవడం తప్పనిసరి. ఎందుకంటే  కేవలం 0.5శాతం తేడా ఉన్నా ఎంతో డబ్బు మిగులుతుంది. ఉదాహరణకు రూ .50 లక్షల లోనుకు వడ్డీ రేటు 7శాతం బదులు 7.5శాతం ఉంటే, 20 సంవత్సరాల్లో రూ .3.64 లక్షలు అదనంగా కట్టాలి. అందుకే సరైన బ్యాంకును ఎంచుకోవడానికి అన్ని విషయాలను స్టడీ చేయాలి.   

1. తక్కువ రేటు ముఖ్యం

వివిధ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు వసూలు చేసే వడ్డీ రేట్ల గురించి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ సైట్ల ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.  అయితే తక్కువ వడ్డీరేటు అందరికీ దొరక్కపోవచ్చు. తక్కువ వడ్డీ ఇవ్వడానికి బ్యాంకులు చాలా షరతులు పెడతాయి. లోన్  కనీసం 5-–7 బ్యాంకులను షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిస్ట్ చేయాలి.  స్టడీ చేస్తే  తక్కువ వడ్డీ రేటు ఇచ్చేందుకు బ్యాంకులు పెట్టే రూల్స్‌‌‌‌ను,  షరతులను తెలుసుకోవచ్చు.  తక్కువ రేటుకు లోన్ దొరికితే మీ నెలవారీ కిస్తీ మొత్తం తగ్గుతుంది. లోన్లు రెపో రేటుతో లింక్ అయి ఉంటాయి కాబట్టి ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ రేట్లను మార్చినప్పుడు కూడా వడ్డీలు మారవచ్చు. చాలా బ్యాంకులు శాలరీడ్ కస్టమర్లకు తక్కువ రేట్లకు లోన్లు ఇస్తాయి. మీరు నాన్–శాలరీడ్  కస్టమర్లు అయితే మీకు సరైన బ్యాంక్‌‌ ఏదో తెలుసుకోవడానికి వీలైనంత సమాచారాన్ని సేకరించాలి. క్రెడిట్‌‌‌‌ స్కోరు బాగున్న వారికి అతి తక్కువ వడ్డీకి లోన్లు ఇస్తారు.  కో–అప్లికెంట్‌‌‌‌గామహిళా బారోవర్‌‌‌‌‌‌‌‌ను పెట్టడం వల్ల వడ్డీ 0.05 శాతం తగ్గే అవకాశాలు ఉంటాయి.  మీ జీవిత భాగస్వామి సాయంతో మంచి వడ్డీ రేటుకే లోన్‌‌‌‌ పొందవచ్చు.

2.సరైన ఆస్తిని ఎంచుకోండి

మీరు తక్కువ వడ్డీ రేటు ఇచ్చే బ్యాంకును ఎంచుకున్నప్పటికీ  మీ ప్రొఫైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వారి రూల్స్‌‌‌‌కు అనుగుణంగా లేకుంటే లోన్‌‌‌‌ను ఆమోదించకపోవచ్చు. మీకున్న ప్రాపర్టీని లెండర్ అప్రూవ్ చేయనప్పుడు ఇలా జరుగుతుంది. చాలా మంది బ్యాంకులు కొన్ని  ప్రాంతాల్లోని ఆస్తులకు లోన్లు ఇవ్వవు.  మీ ఆస్తి ఉన్న చోటుకు బ్యాంకు లోన్ వస్తుందో రాదో ముందే తెలుసుకోవాలి.  మీరు కొనాలనుకునే ఆస్తి నెగెటివ్ లిస్టులో ఉంటే వేరే బ్యాంకు గడప తొక్కాల్సి ఉంటుంది. 

3.ఎక్కువ గడువు ఎంచుకోండి

ఎక్కువ కాలం గడువు పెట్టుకొని లోన్ తీసుకోవడం తెలివైన పని. ఉదాహరణకు 20 ఏళ్లతో వార్షిక వడ్డీ రేటుకు 7.5 శాతం చొప్పున రూ .40 లక్షల హోం లోన్ తీసుకుంటే..నెలకు కిస్తీగా రూ. 32,224 కట్టాలి. అయితే,  25 సంవత్సరాల గడువు ఉంటే కిస్తీ రూ .29,560లకు తగ్గుతుంది. 30 సంవత్సరాల గడువుకు కిస్తీ  రూ .27,969లకు పడిపోతుంది. లోన్  గడువు ఎక్కువ ఉంటే,  ఈఎంఐ మొత్తం తక్కువ అవుతుంది. ఎక్కువ డౌన్​పేమెంట్ ఉంటే వడ్డీ, బకాయి మొత్తం తక్కువ అవుతుంది.  లోన్ రీస్ట్రక్చరింగ్ చేసుకుంటే గడువు ఇంకా తగ్గుతుంది.  వీలైనంత ముందస్తు చెల్లింపులు చేయడం ప్రారంభించండి.

4.హోమ్ సేవర్ లోన్లు తీసుకోండి

ఆదాయాల్లో తరచూ హెచ్చుతగ్గులు ఉండేవాళ్లు కొన్ని  నెలలు తక్కువ కిస్తీ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చినప్పుడు, హోమ్ సేవర్ లోన్ తీసుకోవచ్చు.  ఇవి ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్టుల వడ్డీరేట్లకు సమానంగా ఉంటాయి. ఈ లోన్‌‌‌‌కు నెలవారీగా వడ్డీ మాత్రమే చెల్లిస్తే చాలు. కాబట్టి మీకు అనువైన కాలానికి లోన్ పొందవచ్చు.   డబ్బు తక్కువగా ఉంటే తక్కువ వడ్డీ కట్టొచ్చు. డబ్బు సరిపడినంత ఉంటే వడ్డీ చెల్లింపు మొత్తాన్ని పెంచుకోవచ్చు.

5.డౌన్‌‌పే​మెంట్ ఎక్కువ ఉంటేనే బెస్ట్

చాలా బ్యాంకులు లోన్ టూ వాల్యూ (ఎల్‌‌టీవీ) రేషియో ఎక్కువ ఉంచే బారోవర్లకు అతి తక్కువ వడ్డీ రేటును ఆఫర్‌‌‌‌ చేస్తారు. అంటే ఎక్కువ డౌన్​పేమెంట్ కడితే ఎల్‌‌‌‌‌‌‌‌టీవీ నిష్పత్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, తక్కువ వడ్డీ రేటుకు అప్పు పుడుతుంది. 20–25 శాతం కంటే ఎక్కువ డౌన్​పేమెంట్ చెల్లిస్తే అతి తక్కువ రేటును పొందవచ్చు. డౌన్​పేమెంట్ ఎక్కువ ఉంటే కిస్తీతోపాటు ఔట్‌‌స్టాండింగ్ అమౌంట్ కూడా తక్కువగానే కనిపిస్తుంది.