ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించేయండి.!

ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించేయండి.!

బిజినెస్ డెస్క్, వెలుగు:ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంటర్నెట్, స్మార్ట్‌‌‌‌ఫోన్లే! ఇవి రెండూ మన జీవితంలో భాగంగా మారాయి. ఈ రెండింటితో డబ్బు సంపాదించేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. స్కూళ్లు, కాలేజీలు లేక ఖాళీగా ఉంటున్న టీనేజర్లు నెట్ సాయంతో ఎంతో కొంత సంపాదించుకోవచ్చు. హాయిగా ఇంట్లో కూర్చొనే పనిచేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం  

ఫ్రీలాన్స్ వర్క్ 

డబ్బు సంపాదించడానికి సులభమైన మార్గాలలో ఒకటి ఫ్రీలాన్సింగ్. కాపీ రైటింగ్, ట్రాన్స్‌‌లేషన్, గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, మొబైల్ యాప్ డెవెలప్‌‌మెంట్ లేదా మార్కెటింగ్.. ఇలాంటి ఫ్రీలాన్స్ జాబ్స్‌‌ను ఇంట్లో కూర్చొనే చేసుకోవచ్చు. అనేక వెబ్‌‌సైట్లు ఈ తరహా వర్క్‌‌లను ఇస్తున్నాయి.   స్కిల్స్‌‌ను బట్టి డబ్బు చెల్లిస్తాయి. చెగ్ ఇండియా, ఫ్రీలాన్స్ ఇండియా, ఫ్రీలాన్సర్, అప్‌‌వర్క్, ఫివర్ర్ తదితర వెబ్‌‌సైట్లలో ఫ్రీలాన్స్ జాబ్స్ దొరుకుతాయి.

బ్లాగింగ్ / వ్లాగింగ్

ఏదైనా ప్రత్యేకమైన సబ్జెక్ట్స్‌‌పై మీకు స్కిల్ ఉంటే దాని ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఉదాహరణకు వంటలు బాగా వచ్చిన వాళ్లు.. ప్రత్యేక కుకింగ్ బ్లాగ్/వ్లాగ్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు. చూసేవాళ్లు ఎక్కువ ఉంటే, డబ్బు బాగా వస్తుంది. గూగుల్ యాడ్‌‌సెన్స్ ద్వారా ప్రకటనలు, అనుబంధ మార్కెటింగ్ (మీ బ్లాగులో ఇతరుల ప్రొడక్టులను ప్రోత్సహించడం), ప్రొడక్టుల రివ్యూలు చేయడం, ఇతరుల బ్లాగుల్లో గెస్టు పోస్టులు లేదా  యూట్యూబ్‌‌ బ్లాగ్ లేదా వ్లాగ్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు. 
ఎంత సంపాదించవచ్చు?
ఒక బ్లాగర్  నెలకు 20,000–-30,000 రూపాయలు సంపాదించవచ్చు. కొత్తగా స్టార్ట్ చేసే వారి సంపాదన కాస్త తక్కువ ఉండొచ్చు. మనదేశంలో అమిత్ అగర్వాల్ అనే బ్లాగర్ నెలకు రూ. 44.4 లక్షలు సంపాదిస్తున్నారు.

అమెజాన్ అసోసియేట్స్ ఆన్‌‌లైన్

బ్లాగింగ్ చేసేటప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు. అంటే మీ బ్లాగులో/సైటులో అమెజాన్ లింక్స్ వస్తాయి. వాటిపై వ్యూయర్లు క్లిక్ చేసి ఏదైనా కొంటే కమీషన్ వస్తుంది. దీనిని రిఫరల్ ఫీజు అంటారు. ఇందులో ఫ్రీగా చేరవచ్చు. ఉపయోగించడం కూడా ఈజీ.

ఎలా చేయాలంటే..

స్టెప్ 1: www.affiliateprogram. amazon.in వెబ్‌‌సైట్‌‌కు వెళ్లండి. మీ అమెజాన్ అకౌంట్‌‌తో లాగిన్ అవ్వండి. అకౌంట్ సమాచారాన్ని అందించండి.
స్టెప్ 2: తరువాత మీ వెబ్‌‌సైట్‌‌లు , యాప్స్ లిస్టులను ఇవ్వాలి. కనీసం ఒకదాంట్లో మీరు బ్యానర్లు, విడ్జెట్‌‌లు, లింక్‌‌లు లేదా ఇతర అమెజాన్ ప్రకటనలను ప్రదర్శించాలి. మీరు 50 సైట్లు లేదా యాప్స్‌‌ను చేర్చవచ్చు. 
స్టెప్ 3: ప్రొఫైల్ విభాగంలో, మీ సైట్‌‌లు , యాప్స్, మీరు ఉంచాలనుకుంటున్న ప్రొడక్టులు, మీరు సాధించగల ట్రాఫిక్, మీరు ఆదాయాన్ని ఎలా సంపాదిస్తారు, వ్యూయర్స్ సంఖ్య వంటి వివరాలు ఇవ్వాలి. 
స్టెప్ 4:  చివరగా అమెజాన్ రూల్స్‌‌ను అంగీకరిస్తే, పనిని మొదలుపెట్టొచ్చు. ఒక్కో ఆర్డర్‌‌‌‌పై దాదాపు 10 శాతం వరకు కమీషన్ ఇస్తారు.  

ఆన్‌‌లైన్ సర్వేలు

టీనేజర్లు డబ్బు సంపాదించడానికి సులభమైన మార్గాలలో ఒకటి పెయిడ్ ఆన్‌‌లైన్ సర్వేలు. ఇందుకు స్వాగ్‌‌బక్స్ ఫేమస్ వెబ్‌‌సైట్. సర్వే ఫామ్లను నింపడం, వీడియోలు చూడటం , షాపింగ్ వంటి అనేక కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు ఇది డబ్బు చెల్లిస్తుంది. టోలునా, టెల్లీ పల్స్, క్యాష్‌‌క్రేట్ (సర్వే సైట్ల అగ్రిగేటర్), వాల్యూడ్ ఒపీనియన్స్, ఒపీనియన్ బ్యూరో, స్ట్రీట్బీస్ (యాప్) వంటివి కూడా పెయిడ్ సర్వేలను అందిస్తాయి.  ఒక నెలలో ఒక వ్యక్తి నిర్దుష్ట సంఖ్యలో మాత్రమే సర్వేల్లో పాల్గొనేలా రూల్స్ ఉంటాయి.  
స్టెప్ 1: మీ పర్సనల్ సమాచారం ఇవ్వడం ద్వారా వెబ్‌‌సైట్‌‌లో రిజిస్టర్ అయితే ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. 
స్టెప్ 2: రిజిస్టర్డ్ ఈ–-మెయిల్‌‌కు సర్వేలు వస్తాయి.
స్టెప్ 3: మీకు వీలైనన్ని సర్వే ఫామ్లను పూరించండి. పాయింట్లు మీ అకౌంట్‌‌కు జమవుతాయి. వాటిని రీడీమ్ చేసుకుంటే డబ్బులు వస్తాయి. 

ఎంత సంపాదించవచ్చు?

పాయింట్లను రిడీమ్ చేస్తే నగదు (పేపాల్‌‌తో) పొందవచ్చు. చెక్కుల ద్వారా లేదా గిఫ్ట్ వోచర్లు , కార్డుల ద్వారా తీసుకోవచ్చు. వారానికి 1,000–-2,000 రూపాయలు సంపాదించవచ్చు. బాగా సంపాదించడానికి కనీసం 8–-10 సైట్లు లేదా యాప్‌‌లలో రిజిస్టర్ కావడం మంచిది.
పుస్తకాలను అద్దెకివ్వడం/అమ్మడం, ఆన్‌‌లైన్ ట్యూటరింగ్, ప్రాజెక్ట్ వర్క్
 మీకు చదవడం ఇష్టమైతే కొంత పాకెట్ మనీ సంపాదించుకోవచ్చు.  మీరు మీ పుస్తకాలను అద్దెకు ఇవ్వవచ్చు. మునుపటి సంవత్సరపు స్కూల్ పుస్తకాలను అమ్మవచ్చు. ఆన్‌‌లైన్‌‌ ట్యూటర్‌‌గా పని చేయవచ్చు. స్టూడెంట్స్ ప్రాజెక్ట్ పనిలో వారికి సహాయపడవచ్చు. ఉడాసిటీ, ఉడెమీ, లిండా వంటి ఆన్‌‌లైన్ ప్లాట్‌‌ఫామ్‌‌లలో టీచింగ్ లేదా కోర్సులు ఆఫర్ చేయడం ద్వారా కూడా సంపాదించవచ్చు. వేదాంతు, ట్యూటర్‌‌మీ, టీచర్ఆన్ మొదలైన సైట్లలో ఇలాంటి జాబ్స్ ఉంటాయి.
 ఎలా చేయాలంటే..
స్టెప్ 1: ఆన్‌‌లైన్ ట్యూటర్ కావాలనుకుంటే  మీరు మొదట ఆ సైట్‌‌లో రిజిస్టర్ కావాలి. ఆన్‌‌లైన్ ఇంటర్వ్యూ లేదా డెమో ద్వారా మీ స్కిల్‌‌ను పరిశీలిస్తారు. వాళ్లకు మీ టీచింగ్ నచ్చితే జాబ్ ఇస్తారు. 
స్టెప్ 2:  ఆన్‌‌లైన్‌‌లో టీచింగ్ కోసం కంప్యూటర్ లేదా ల్యాప్‌‌టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ , మీ సబ్జెక్టులో స్కిల్ తప్పనిసరి.

ఎంత సంపాదించవచ్చు?

ఆన్‌‌లైన్ ట్యూటరింగ్ సైట్‌‌లతో  నెలకు రూ .10,000 నుండి రూ .1 లక్ష వరకు  సంపాదించవచ్చు. నెలజీతం లేదా గంటకు నిర్దుష్ట మొత్తం చెల్లిస్తారు.  మీ స్నేహితులు, పొరుగువారు , పరిచయస్తులను కోర్సులు బోధించడానికి గంటకు 200 రూపాయలు తీసుకోవచ్చు. అనుభవం ఎక్కువ ఉన్న వాళ్లు గంటకు రూ.వెయ్యి వరకు తీసుకోవచ్చు. ఒక్కో ప్రాజెక్టుకు రూ .200 నుంచి 1,500 రూపాయల దాకా వసూలు చేయవచ్చు.

టీ-షర్టులను ఆన్‌‌లైన్‌‌లో డిజైన్ చేయండి

 మీకు క్రియేటివిటీ, డిజైన్స్‌‌‌‌పై పట్టు ఉంటే ఆన్‌‌‌‌లైన్లో టీ-షర్టుల కోసం డిజైన్లను తయారు చేసి సంపాదించవచ్చు. ఇలాంటి అసైన్‌‌‌‌మెంట్లు ఇచ్చే భారతీయ , విదేశీ  వెబ్‌‌‌‌సైట్లు అనేకం ఉన్నాయి. డిజైన్ వరకు మాత్రమే మీ బాధ్యత.  తయారీ, అమ్మకం లేదా రవాణా వంటి విషయాలతో సంబంధం ఉండదు. ఇలాంటి వర్క్ కోసం టీషాపర్, ది సోల్డ్ స్టోర్ , మై హోమ్ స్టోర్,  టీస్ప్రింగ్, జాజిల్ మొదలైన సైట్లను, యాప్స్‌‌‌‌ను చూడొచ్చు.  

ఎలా చేయాలంటే..

స్టెప్ 1: వెబ్‌‌‌‌సైట్‌‌‌‌తో ఒక అకౌంట్‌‌‌‌ను ఓపెన్ చేయండి.
స్టెప్ 2:  టీషర్ట్‌‌‌‌పై డిజైన్‌‌‌‌ను సృష్టించి అప్‌‌‌‌లోడ్ చేయవచ్చు. కొన్ని సైట్లు టీ-షర్టు శైలి, రంగులు , టెక్స్ట్ ఫాంట్లను ఎంచుకోవడానికి, ధరను నిర్ణయించడానికి పర్మిషన్లు ఇస్తాయి.
స్టెప్ 3: వెబ్‌‌‌‌సైటే మీ డిజైన్‌‌‌‌ను ప్రచారం చేస్తుంది కానీ ఇది సరిపోదు. మీ డిజైన్లను మార్కెట్ చేయడానికి ఫేస్‌‌‌‌బుక్, ఇన్‌‌‌‌స్టాగ్రామ్ వంటి ఇతర సోషల్ మీడియా ఛానెల్స్ ద్వారా కూడా ప్రచారం చేయాలి.

ఎంత సంపాదించవచ్చు?

వెబ్‌‌‌‌సైట్లను బట్టి రేట్లు ఉంటాయి.  నెలవారీ లేదా దాని సేల్ షెడ్యూల్ ప్రకారం చెల్లిస్తారు. కొందరు 10–-20 శాతం రాయల్టీని చెల్లిస్తారు. మరికొందరు ఒక టీ–షర్ట్‌‌పై  రూ.30‌‌‌‌‌‌‌‌–300 వరకు ఫిక్స్‌‌డ్‌‌గా ఇస్తారు.

పోడ్‌‌‌‌కాస్ట్‌‌ల ద్వారా కథలు చెప్పడం

మీకు కథలపై ఇంట్రెస్ట్ ఉంటే, ఈ హాబీతో డబ్బు సంపాదించవచ్చు.  పోడ్‌‌‌‌‌‌కాస్ట్‌‌‌‌ల ద్వారా కథలు చెప్పవచ్చు.  డిజిటల్ ఆడియో లేదా వీడియో ఫైళ్ళను పోడ్‌‌‌‌కాస్ట్‌‌‌‌లు అంటారు.  దాదాపు 20 కోట్ల మంది పోడ్‌‌‌‌కాస్టుల స్టోరీలు వింటారని అంచనా. దాదాపు 40 పోడ్‌‌‌‌కాస్ట్ కంపెనీలు  ఈ సేవలు అందిస్తున్నాయి. 

 ఎలా చేరాలంటే..

స్టెప్ 1: మీ మొబైల్ ఫోన్‌‌‌‌లో పోడ్‌‌‌‌కాస్ట్‌‌‌‌ను రికార్డు చేయాలి. ప్రొఫెషనల్‌‌‌‌ ప్రొడక్టును తయారు చేయాలంటే పరికరాలు ఉండాలి. క్వాలిటీ  మైక్రోఫోన్, పాప్ ఫిల్టర్, కంప్యూటర్ లేదా ల్యాప్‌‌‌‌టాప్, ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్‌‌‌‌వేర్ అవసరం.
స్టెప్ 2: తరువాత, మీరు పోడ్‌‌‌‌కాస్ట్‌‌‌‌ను  గూగుల్ పోడ్‌‌‌‌కాస్ట్, యాంకర్, స్పాటిఫై వంటి ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లలో పోస్టు చేయవచ్చు. 
స్టెప్ 3: మీరు మొదట ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లో రిజిస్టర్ అయ్యాక, ఎపిసోడ్‌‌‌‌ను రికార్డ్ చేయొచ్చు లేదా ముందే రికార్డ్ చేసినదాన్ని అప్‌‌‌‌లోడ్ చేయాలి.

ఎంత సంపాదించవచ్చు?

 స్పాన్సర్లు, ప్రకటనలు, స్పాన్సర్షిప్‌‌‌‌లు, అమ్మకాలు, కోర్సులు , మర్చండైజ్ ద్వారా సంపాదించవచ్చు. సుమారు 500 డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌లు ఉంటే సంపాదన మొదలుపెట్టవచ్చు. భారీ ఆదాయం కోసం మీకు ఎక్కువ మంది అడ్వర్టైజర్లు, స్పాన్సర్లు కావాలి. ఐదువేల కంటే ఎక్కువ మంది ఆడియెన్స్ ఉంటే భారీ ఆదాయాలకు అవకాశం ఉంటుంది.