కారు రెంట్ కి తీసుకుని అమ్మేస్తారు

కారు రెంట్ కి తీసుకుని అమ్మేస్తారు

సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నామని ఫేక్ ఐడీ కార్డు, ఆధార్ కార్డు క్రియేట్ చేసుకుని ఓఎల్ఎక్స్, ఫేస్ బుక్ లో కార్లు రెంట్ కి ఇచ్చేవారి నంబర్లను తీసుకుంటారు . కారు రెంట్ కి తీసుకుని వాటి డాక్యుమెంట్స్, నంబర్ ప్లేట్ మార్చి మహారాష్ట్ర, గోవా లాంటి ఇతర రాష్ట్రాల్లో అమ్మేస్తారు. ఇలా కార్ల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాకి చెందిన ముగ్గు రిని శనివారం రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గరి నుంచి మూడు కాస్ట్లీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు
గచ్చిబౌలిలోని తన ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

ముఠాలో ముగ్గురూ ఎక్స్ పర్ట్పే

మహారాష్ట్రలోని పుణెకి చెందిన నిదీశ్ వినాయక్ కలంకార్(38) అక్కడే డాగ్ బ్రీడింగ్ బిజినెస్ చేస్తున్నాడు. మద్యానికి బానిసైన నిదీశ్ జల్సాలకు డబ్బులు సరిపోకపోవడంతో ఓ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుని కార్లను దొంగలించాలని ప్లాన్ చేశాడు.

ఇందుకోసం తానే ఫేక్ ఫొటోలు, ఫేక్ ఐడీ కార్డులను క్రియేట్ చేసేవాడు. ఈ ముఠాలో పుణెకు చెందిన మరో వ్యక్తి క్రిస్టోఫర్ జోసెఫ్(31) డిఫెన్స్ సర్వీస్ లో పనిచేశాడు. క్రిస్టోఫర్ కార్లలో అమర్చిన జీపీఎస్ సిస్టమ్ ను తొలగించడం, కారును ట్రేస్ చేయకుండా చేయడంలో ఎక్స్ పర్ట్. ముఠాలో మరో సభ్యుడు మహరాష్ట్రలోని సంగ్లీ జిల్లాకు చెందిన సుశాంత్ సురేశ్ ఖర్గే(26) స్వయం ఉపాధి పొందుతుండేవాడు. సురేశ్ ఖర్గే బీటెక్ పూర్తి చేశాడు. ఇంగ్లీష్ బాగా మాట్లాడటంతో పాటు డ్రైవింగ్ కూడా చేసేవాడు. ఓఎల్ఎక్స్, ఫేస్ బుక్ లో కార్ రెంట్ ఇచ్చే నంబర్లను నిదీశ్ సేకరించి తీసుకొస్తే సురేశ్ ఖర్గే ఆ కారు ఓనర్లతో ఇంగ్లీషులో మాట్లాడి వారికి నమ్మకం కలిగించేవాడు. పుణెకి చెందిన మరో వ్యక్తి బండు మనియా ఫేస్ బుక్, ఓఎల్ ఎక్స్ లో కార్లను రెంట్ కిచ్చే ఓనర్ల ఫోన్ నంబర్లను నిదీశ్ కు అందజేసేవాడు. నలుగురు సభ్యులున్న ఈ ముఠాకి నిదీశ్ వినాయక్ లీడర్ గా ఉండేవాడు.

సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా ఫేక్ ఐడీ కార్డుతో 

ఈ ముఠాలో ప్రధాన నిందితుడు నిదీశ్ ఫేక్ ఆధార్ కార్డు, విప్రో కంపెనీ పేరుతో ఫేక్ కార్డు క్రియేట్ చేసేవాడు. తర్వాత తన సహాయకుడు బండు మనియాతో కలిసి హైదరాబాద్, పుణె, చెన్నై వంటి సిటీల్లో సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్ ను సెలక్ట్ చేసుకుంటారు. అనంతరం ఆన్ లైన్, ఫేస్ బుక్, ఓఎల్ఎక్స్, పేపర్ యాడ్స్ లో కార్లను రెంట్ కి ఇచ్చే ఓనర్ నంబర్స్ ను వెతికి తీసుకుంటారు. గుర్తు తెలియని ఫోన్ నంబర్ నుంచి గ్యాంగ్ లీడర్ నిదీశ్ కారు ఓనర్ కి ఫోన్ చేసి తాను విప్రోలో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ నని చెప్పి పరిచయం చేసుకుంటాడు.

తనకు కారు రెంట్ కి కావాలని అడుగుతాడు. కారు ఓనర్ కి కొం త అడ్వాన్స్ తో పాటు.. తన ఫేక్ ఐడీ, ఆధార్ కార్డు, ఫేక్ బ్యాంక్ చెక్కులు ఇచ్చి కారు తీసుకెళ్లేవాడు. నిదీశ్ వినాయక్ కారును తీసుకుని సిటీ సరిహద్దు దాటి బయటకొచ్చేవాడు. తర్వాత ప్లాన్ ప్రకారం కారులో ఉన్న జీపీఎస్ సిస్ట్ మ్ ను క్రిస్టోఫర్ జోసెఫ్ తొలగించేవాడు. ఆ కారును పుణెకి తీసుకెళ్లి అక్కడ కారు నంబర్ ప్లేట్ మార్చేవారు. ఇలా దొంగిలిం చి తీసుకొ-
చ్చిన వెహికల్ కు ఫేక్ రిజిస్ట్రేషన్ కార్డు, ఇన్సూ రెన్స్ పేపర్స్ క్రియేట్ చేసి అక్కడ తక్కువ ధరకు ఆ కారును అమ్మేవారు. నిదీశ్ వినాయక్ ముఠా
ఇలా ఇప్పటివరకు మొత్తం 6 కార్లను సిటీ నుంచి దొంగిలిం చి ఇతర రాష్ట్రాల్లో అమ్మేశారు.

మూడు రాష్ర్టాల్లో చోరీలు 

ఈ నిదీశ్ వినాయక్ ముఠా సభ్యులు ఇప్పటి వరకు మూడు రాష్ర్టాల్లో కార్లను రెంట్ కి అని చెప్పి తీసుకొని వాటిని ఇతర రాష్ర్టాల్లో తక్కువ ధరకే అమ్మేశారు. వీరిపై సైబరాబాద్ పరిధిలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో 2 కేసులు, మహరాష్ర్ట పుణెలో మరో కేసు నమోదైంది. సిటీలోని టోలిచౌకి పీఎస్ పరిధిలో కూడా మరో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. వీటితో పాటు గోవా రాష్ర్టంలో ముఠా సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం రాయదుర్గం పోలీసులు ఈ ముఠాకి చెందిన నిదీశ్ వినాయక్, క్రిస్టోఫర్ జోసెఫ్, సురేశ్ ఖర్గేను అరెస్టు చేశారు. మరో సభ్యుడు బండు మనియా పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల్లో ఒక ఎర్టిగా కారు, స్విఫ్ట్​ వీడీఐ కారును, పుణె నగరంలో దొంగలించిన ఇన్నోవా వెహికల్ ను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మూడు కార్ల విలువ
సుమారు రూ.37లక్షలు ఉంటుందని..ఈ ముఠా దొంగిలించిన మరో మూడు కార్లను ఎక్కడున్నాయో గుర్తించి వాటిని కూడా తొందరలోనే స్వాధీనం చేసుకుం టామని డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన రాయదుర్గం డీఐ విజయ్ కుమార్ ,
సిబ్బందిని డీసీపీ అభినందించారు.