
బెంగళూరు: ప్రముఖ కన్నడ రచయిత ఎస్ఎల్ భైరప్ప (94) బుధవారం కన్నుమూశారు. కార్డియాక్ అరెస్టుకు గురై ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ‘‘నవలా రచయిత, తత్వవేత్త ఎస్ఎల్ భైరప్ప బుధవారం మధ్యాహ్నం 2.38 గంటలకు కార్డియాక్ అరెస్టుకు గురై చనిపోయారు’’ అని ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.
భైరప్ప వంశవృక్ష, దాతు, పర్వ, మందార మొదలైన నవలలు రాశారు. ఆయన రచనలు చాలా వరకు ఇతర భాషల్లోకి అనువదించారు. పద్మభూషణ్, సరస్వతి సమ్మాన్, పద్మశ్రీ, సాహిత్య అకాడమీ తదితర పురస్కారాలను అందుకున్నారు. ఆయన రచనలు నాయి-నేరాలు, మాటదాన, వంశవృక్ష, తబ్బలియు నీనాదే మగనే సినిమాలుగా, గృహభంగ, దాతు టీవీ సీరియల్ గా రూపొందాయి.