ఐపీఓకు లెన్స్‌‌కార్ట్.. భారీ విస్తరణ దిశగా ఫండ్ రైజింగ్ ప్లాన్

ఐపీఓకు లెన్స్‌‌కార్ట్..  భారీ విస్తరణ దిశగా ఫండ్ రైజింగ్ ప్లాన్

న్యూఢిల్లీ: కళ్ళద్దాల రిటైలర్ లెన్స్‌‌కార్ట్ తన ఇనీషియల్​ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం సెబీకి దరఖాస్తు చేసుకుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 2,150 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిధులు పూర్తిగా కొత్త షేర్ల జారీ ద్వారా వస్తాయి. ఐపీఓలో భాగంగా, సాఫ్ట్‌‌బ్యాంక్ విజన్ ఫండ్, టెమాసెక్ వంటి సంస్థలతో సహా, ప్రస్తుత వాటాదారులు తమ వద్ద ఉన్న కొన్ని షేర్లను అమ్ముతారు.  

కంపెనీ యాజమాన్యంలోని స్టోర్ల ఏర్పాటు చేయడానికి రూ.272.6 కోట్లు,   లీజు, అద్దె  లైసెన్స్ ఒప్పందాలకు సంబంధించిన చెల్లింపుల కోసం రూ.591.44 కోట్లు, టెక్నాలజీ,  క్లౌడ్ మౌలిక సదుపాయాలలో పెట్టుబడుల కోసం రూ.213.37 కోట్లు ఉపయోగిస్తారు.