పాలమూరులో చిక్కిన చిరుత..హైదరాబాద్లోని జూపార్క్కు తరలింపు

పాలమూరులో చిక్కిన చిరుత..హైదరాబాద్లోని జూపార్క్కు తరలింపు

మహబూబ్​నగర్, వెలుగు: మూడు నెలలుగా మహబూబ్​నగర్​ప్రజలకు, పోలీసులు, ఫారెస్ట్​ఆఫీసర్లకు కంటి మీద కునుకు లేకుండా చేసిన చిరుతపులి ఎట్టకేలకు చిక్కింది. సోమవారం తెల్లవారుజామున ఆహారం కోసం గుట్టల్లోంచి బయటకు వచ్చి బోనులోని మేకను వేటాడబోయి చిక్కుకుంది. దీంతో తిరుమలదేవుని గుట్ట, వీరన్నపేట కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. చిరుత సంచరిస్తున్న గుట్టపై నాలుగు బోన్లు, 10 ట్రాప్​ కెమెరాలను ఏర్పాటు చేసి.. ఎరగా మేక పిల్లలను ఉంచారు. 

వేటాడేందుకు వచ్చి బోనులో చిక్కి బయట పడేందుకు యత్నించగా చిరుత ముఖానికి తీవ్రగాయమైంది. ఉదయం 10 గంటల సమయంలో ఫారెస్ట్​ సిబ్బంది గుర్తించి, ఉన్నతాధికారులకు సమాచారం అందించగా.. వారు ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ లోని​జూపార్క్​కు తరలించారు. మూడు రోజులు అబ్జర్వేషన్​లో ఉంచి,  చిరుత ఆరోగ్యం నిలకడగా ఉంటే నల్లమల లేదా కవ్వాల్​ఫారెస్ట్​లో వదిలేందుకు చర్యలు తీసుకుంటామని డీఎఫ్​వో సత్యనారాయణ తెలిపారు.