
ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కి కరెంట్ షాక్ తో చిరుత మృతి చెందింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఉన్న సిందేవాహి అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి ఓ చిరుతపులి ప్రవేశించింది. అక్కడ ట్రాన్స్‌ఫార్మర్‌పై ఉన్న కోతిని చూసి దానిని వేటాడేందుకు ట్రాన్స్‌ఫార్మర్ పైకి ఎక్కింది.
ఈ క్రమంలో కరెంట్ షాక్ రావడంతో కోతితో పాటుగా చిరుతపులి కూడా మృతి చెందింది. విషయం తెలుసుకున్న అటవీ విద్యుత్ శాఖ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని విగతజీవులుగా పడి ఉన్న జంతువులను కిందకు దించారు.