భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిరుత పులి సంచారం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిరుత పులి సంచారం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిరుత పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. చర్లమండంలోని పలు గ్రామాల్లో సంచరిస్తూ స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు పులి జాడలను గుర్తించి పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. 

గత రెండు రోజులుగా చర్ల మండంలోని సుబ్బంపేట, ఎదిరగుట్ట  అటవీప్రాంతంలో రహదారిపై చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. రాత్రివేళల్లో సుబ్బంపేట ఇసుక ర్యాంప్ లో కూడా  కనిపించినట్లు డ్రైవర్లు ఫారెస్ట్ అధికారులు సమాచారం అందించారు. దీంతో రెండు గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు.  చిరుతపులి సంచారంపై ఫారెస్ట్  అధికారులు స్థానిక గ్రామాల ప్రజలను అలర్ట్ చేశారు. బావులు, పొలాలకు వెళ్లే వారు, పశువులను మేపేందుకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.