కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత

కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత

మెదక్ జిల్లాలో చిరుతపులి జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.  జిల్లాలోని చిన్న శంకరం పేట మండలం కామారం తండా దగ్గరల్లో చిరుత సంచరిస్తోంది. గతంలో మేకపిల్లలు, లేగ దూడలపై దాడి చేసింది.  కామారం తండా గ్రామం శివారుల్లో గుడిసెలు వేసుకొని ఉంటున్న మహారాష్ట్ర కూలీలకు నిన్న అర్థరాత్రి పులి కనిపించింది.  దాంతో అక్కడి జనం మంటలు పెట్టి, పటాకులు కాల్చి చిరుతను వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు.  ఏడాది కాలంగా రామాయంపేట, చిన్నశంకరం పేట మండలాల్లో చిరుత పులులు తిరుగుతున్నట్టు గ్రామస్థులు చెబుతున్నారు. గతంలో ఒక పులిని అటవీశాఖాధికారులు పట్టుకొని ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇప్పుడు కూడా బోన్లు ఏర్పాటు చేసి చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు.