
లింగంపేట, వెలుగు : మండలంలోని కంచుమల్ గ్రామ శివారులో శనివారం సాయంత్రం చిరుత పులి కనిపించింది. చిరుత రోడ్డు దాటుతుండగా అటు వైపు వెహికల్స్‌లో వెళ్తున్న వారు గమనించారు.
దూడను చంపిన చిరుత
నవీపేట్, వెలుగు :మండలంలోని మహంతం శివారులో పశువుల కొట్టం పై చిరుత పులి దాడి చేసి దూడను చంపింది. ఫారెస్ట్ ఆఫీసర్స్, గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేకల లక్ష్మణ్ కౌలుకు చేస్తున్న పొలం వద్ద పశువుల కొట్టం లో నాలుగు గేదెలు, దూడ ఉన్నాయి. శుక్రవారం రాత్రి చిరుత దాడి చేసి, దూడను చంపింది. శనివారం ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా, ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వెటర్నరీ డాక్టర్ నరేందర్ దూడ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు జవహర్, సుధీర్ సూచించారు.