MS Dhoni: ధోనీకి బీసీసీఐ బంపర్ ఆఫర్.. గంభీర్‌తో కలిసి పని చేయడానికి మిస్టర్ కూల్ ఒప్పుకుంటాడా..?

MS Dhoni: ధోనీకి బీసీసీఐ బంపర్ ఆఫర్.. గంభీర్‌తో కలిసి పని చేయడానికి మిస్టర్ కూల్ ఒప్పుకుంటాడా..?

టీమిండియా మాజీ కెప్టెన్.. మూడు ఐసీసీ టోర్నీలు భారత జట్టుకు అందించిన విజయవంతమైన సారధి మహేంద్ర సింగ్ ధోనీ భారత జట్టుకు మెంటార్ గా రాబోతున్నాడనే వార్తలు వైరల్ గా మారుతున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం 2026 టీ20 వరల్డ్ కప్ కు ముందు భారత జట్టు మెంటార్ గా ఉండేందుకు ధోనీకి బీసీసీఐ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ధోనీలాంటి సక్సెస్ ఫుల్ కెప్టెన్ భారత జట్టుకు ప్రధాన కోచ్ గా ఉంటే బాగున్నట్టు బీసీసీఐ కోరుకుంటుందట. అయితే ధోనీ మెంటార్ పదవికి ఇప్పుడు ఒప్పుకుంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. 

ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా ఉంటున్న గౌతమ్ గంభీర్ కు ధోనీకి మధ్య మంచి సంబంధాలు లేనట్టు కొన్ని సంవత్సరాల నుంచి  టాక్ నడుస్తూనే ఉంది. ఇద్దరికీ వ్యక్తిగత విబేధాలు ఉన్నాయని.. ఈ కారణంగానే మహేంద్రుడు మెంటార్ పదవికి అంగీకరించకపోవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. ధోనీ టీమిండియా మెంటార్ బాధ్యతలను తొలిసారి 2021 టీ20 వరల్డ్ కప్ సమయంలో చేపట్టాడు. ధోని మెంటర్‌గా ఎంపికైనా 2021 టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. గ్రూప్ దశ దాటలేక ఇంటిదారి పట్టింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ ప్రపంచ కప్ ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. 

టీ20 వరల్డ్ కప్ కు కేవలం ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. 2026 ఫిబ్రవరిలో ఇండియా వేదికగా ఈ పొట్టి ఫార్మాట్ జరగనుంది. టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగబోతుంది. సొంతగడ్డపై జరగనుండడంతో టీమిండియా టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగబోతుంది. ఐపీఎల్ 2025 సీజన్ లో ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడి తనలో ఇంకా క్రికెట్ ఉందని నిరూపించాడు. గతంలో టీ20 వరల్డ్ కప్ కోసం మెంటార్ బాధ్యతలను స్వీకరించి ఒక్క రూపాయి కూడా తీసుకొని ధోనీ.. కుర్రాళ్లతో మళ్ళీ భారత జట్టులో మెంటార్ రోల్ కు అంగీకరిస్తాడో లేదో మరికొన్ని రోజుల్లో తేలనుంది.