
చేర్యాల, వెలుగు: చుంచనకోట, కడవేర్గు, పోతిరెడ్డిపల్లి గ్రామాల మధ్య ఉన్న అడవుల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ బీట్ఆఫీసర్తెలిపారు. ఆదివారం పులి ఒక లేగదూడను చంపినట్లు గుర్తించామని తెలిపారు. రైతులందరూ పశువులను ఇంటి వద్దనే కట్టివేయాలని, పంట పొలాలకు రక్షణగా ఉచ్చులను పెట్టవద్దని సూచించారు. ప్రజలు పొలం పనుల కోసం గుంపులుగా వచ్చి గుంపులుగా వెళ్లాలని సూచించారు.