అనుమానాస్పద స్థితిలో చిరుత పులి మృతి

అనుమానాస్పద స్థితిలో చిరుత పులి మృతి

అడవిలో చిరుత పులి మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గం పెద్ద ఎల్కిచర్ల అడవిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

చిరుత పులి అనుమానస్పదంగా మృత్యు వాత పడిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. గత ఐదారు రోజుల క్రితమే.. చిరుత చనిపోయినట్లు ప్రాథమిక అంచనాగా అధికారులు గుర్తించారు. అటవీశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని చిరుత కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత చిరుత పులి మృతికి కారణాలను పరిశీలిస్తున్నారు. 

పెద్ద ఎల్కిచర్ల పెద్దడవి 654 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ అడవిలో క్రూర మృగాలు ఉన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే గొర్ల కాపరులకు చిరుత మరణించిన విషయం తెలుసుకొని గ్రామంలో ఈ సమాచారాన్ని చెప్పారు. దీంతో సమాచారం అందుకున్న అటవి శాఖ సిబ్బంది, పోలీసులు ప్రస్తుతం సంఘటనా స్థలాన్ని సందర్శించి సంఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. చిరుత పులి పోస్టుమార్టం అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపామని చెప్పారు.

ఇదిలా ఉంటే క్రూరమృగాలు సంచరిస్తున్న ఈ అటవీ చుట్టుపక్కల గ్రామాలలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, అటవీశాఖ అధికారులు చిరుత పులులు జనావాసాల్లోకి రాకుండా ప్రత్యేక ఏర్పాటు చేయాలని కోరారు.