తిరుమలలో చిక్కిన మరో చిరుత.. డీఎన్​ఏ టెస్ట్​ చేస్తున్న డాక్టర్లు

తిరుమలలో చిక్కిన మరో చిరుత.. డీఎన్​ఏ టెస్ట్​ చేస్తున్న డాక్టర్లు

తిరుమలలో  తాజాగా మరో చిరుత బోనులో చిక్కింది.  నడకమార్గంలో దాని సంచారాన్ని గుర్తించేందుకు 500 కెమెరాలు ఏర్పాటు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. ఇటీవల నడకమార్గంలో లక్షిత అనే బాలిక మృతిచెందిన విషయం తెలిసిందే. 

అప్రమత్తమైన టీటీడీ భక్తుల భద్రతకు చర్యలు చేపట్టింది. ట్రాక్ కెమెరాలతో పాటు బోనులు అమర్చి వాటిని పట్టుకోవాలని అధికారులు ప్రయత్నించారు. ఇదే క్రమంలో ఆగస్టు 17 తెల్లవారుజామున ఓ చిరుత బోనుకు చిక్కింది. వివిధ ప్రాంతాల్లో చిరుతల కోసం బోన్లు కూడా ఏర్పాటు చేశారు. 

మోకాళ్ల మెట్టు, 36వ మలుపు వద్ద బోన్లును అమర్చారు. నడకదారిలో అదనపు ఎల్‌ఈడీ లైటను అధికారులు ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో ఇవ్వాళ మరో చిరుత బోనులో చిక్కింది. డాక్టర్లు లక్షితపై దాడి చేసిన చిరుత తాజాగా పట్టుబడిందా? కాదా అని టెస్ట్​ చేయడానికి బాలికతో పాటు చిరుత డీఎన్​ఏను టెస్ట్​చేస్తున్నారు. 

ఇప్పటి వరకు మూడు చిరుతలను పట్టుకున్నారు ఫారెస్ట్ అధికారులు. తాజాగా  పట్టుబడిన చిరుతను ఎస్వీ జూపార్క్ కు తరలించారు.12 ఏళ్ళ పిల్లలను ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే  నడకదారిలోకి అనుమతిస్తున్నారు. నడకమార్గం మొత్తం ఫెన్సింగ్​ వేయడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు.