పాలమూరులో మళ్లీ చిరుత కలకలం

పాలమూరులో మళ్లీ చిరుత కలకలం

పాలమూరు, వెలుగు: కొన్ని రోజులుగా మహబూబ్​నగర్ సిటీ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న చిరుతను ఫారెస్ట్  అధికారులు పట్టుకొని జూ పార్క్ తరలించగా, ఇప్పుడు మరో చిరుత కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీడీ గుట్ట ప్రాంతంలో సాయంత్రం చిరుత పులి కనిపించింది. 10 రోజుల కిందటే ఇదే గుట్టల్లో ఫారెస్ట్  అధికారులు బోను ఏర్పాటు చేసి  చిరుతను పట్టుకున్నారు. టీడీ గుట్ట ప్రాంతంలో ఎన్ని చిరుతలు సంచరిస్తున్నాయో అర్థం కావడం లేదని, ఫారెస్ట్  అధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.