కేయూ క్యాంపస్ స్టూడెంట్లకు వాట్సాప్ లో పాఠాలు

కేయూ క్యాంపస్ స్టూడెంట్లకు వాట్సాప్ లో పాఠాలు

కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్లకు సెల్‍ఫోన్‍ పాఠాలు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‍ విస్తృతి నేపథ్యంలో విశ్వవిద్యాలయానికి సెలవులు ప్రకటించ గా స్టూడెంట్లు ఒక్కసారిగా చదువులకు దూరమయ్యా రు. లాక్‍డౌన్‍ వేళ వారు ప్రిపరేషన్ చేసుకునేందుకు సర్కారు చర్యలు తీసుకొంది. ఇందులో భాగంగా యూనివర్సిటీ పెద్దలు ఆన్‍లైన్‍ క్లాసులకు శ్రీకారం చుట్టారు. సెల్‍ఫోన్లు, వాట్సాప్‍ ఆధారంగా తరగతుల నిర్వహణ చేపట్టారు.

24 కోర్సులు..25 కాలేజీలు

కాకతీయ యూనివర్సిటీలో ప్రధానంగా సైన్స్, ఆర్స్ ట్, ఫార్మసీ, ఇంజినీరింగ్‍, సోషల్‍ సైన్సెస్‍, లా, కామర్స్ అండ్‍ బిజినెస్‍ అండ్‍ మేనేజ్ మెంట్ విభాగాల్లో మొత్తం 24 కోర్సులు ఉన్నాయి. క్యాంపస్‍ పరిధిలో 8 చోట్ల తరగతుల నిర్వహణకు తోడు.. మరో 17 కా లేజీల్లో వీటిని నిర్వహిస్తున్నారు. కాగా, 124 మంది రెగ్యులర్‍ ప్రొఫెసర్లు, 200 మంది కాంట్రాక్టు, మరో 100 మంది పార్ట్ టైం పద్ధతిలో క్లాసులు చెబుతున్నా రు. ఈ కోర్సుల్లో దాదాపు 4 వేల మంది స్టూడెంట్లు ఉన్నారు. లాక్‍డౌన్‍ సమయానికి కోర్సులు, సెమిస్టర్‍ ఆధారంగా 50 నుంచి 75 శాతం వరకు సిలబస్‍ పూర్తి చేసినట్లు ఆఫీసర్లు చెబుతున్నా రు. మిగిలిన క్లాసులను ప్రస్తుతం పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు.

స్పెషల్‍ వాట్సాప్‍ గ్రూపులు

కోర్సుల వారీగా స్టూడెంట్లకు క్లాసులు నిర్వహించేందుకు ప్రొఫెసర్లుస్పెషల్‍గా వాట్సాప్‍ గ్రూపులు క్రియేట్‍ చేశారు. యూజీసీ ప్రమాణాలకు అనుగుణంగా.. డీన్లు వీటిని పర్యవేక్షిస్తున్నా రు. ఫ్యాకల్టీ ఇంటి వద్ద ల్యాప్‍టాపులు, సెల్‍ఫోన్లు ముందేసుకుంటున్నారు. తమ సబ్జెక్టులకు సంబంధించి తరగతుల సమాచారం, మెటీరియల్‍ అరమ్థయ్యేలా ముందు పేపర్లో రాస్తున్నారు. అలా తయారు చేసిన పాఠాలను రోజువారీగా సెల్‍ఫోన్‍ గ్రూపుల్లో అప్ లోడ్ చేస్తున్నారు. మరింత ఇన్ఫర్మేషన్‍ కోసం చూడాల్సిన బుక్స్ ఏంటో గైడ్‍ చేస్తున్నా రు. వివిధ ప్రాంతాల్లో ఉండే స్టూడెంట్లు వాటిని డౌన్‍లోడ్‍ చేసుకుని ఇంట్లోనే ప్రిపేర్‍ అయ్యేలా దీనిని రూపొందించారు. సబ్జెక్టుపరంగా ఏవైనా డౌట్లు నివృత్తి చేసుకోవాలంటే అదే వాట్సాప్‍ గ్రూప్‍లో అడగడం, మెయిల్‍చేయడం ద్వారా కావాల్సిన సమాచారం పొందవచ్చు. లేదంటే ప్రొఫెసర్ కు డైరెక్టుగా ఫోన్‍ చేయవచ్చు. ఈ విధానం కాకుండా.. మరికొందరు ప్రొఫెసర్లు పవర్‍పాయింట్‍ ప్రజంటేషన్‍ ద్వారా క్లాసుల నిర్వహణకు చొరవ తీసుకుంటున్నారు.