
బషీర్‌బాగ్, వెలుగు: తెలంగాణలో మాంసం దుకాణాలు తప్ప అన్ని వ్యాపారాలు మార్వాడీలే చేస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ బచావో మూమెంట్ పేరుతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ మనదేనని, ఎవరు వచ్చినా వెళ్లగొట్టాలని పిలుపునిచ్చారు. మార్వాడీలు విక్రయించే వస్తువులను బాయికాట్ చేయాలని, వారి ఇళ్లలో ఎవరూ పనిచేయవద్దని సూచించారు.
మార్వాడీలు గంజాయి, హెరాయిన్, మారణాయుధాలను విక్రయిస్తున్నారని, ప్రతి నెలా రూ.200 కోట్లు గుజరాజ్, రాజస్థాన్ కు తరలిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వారికి మద్దతు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. మార్వాడీ గో బ్యాక్ ఉద్యమానికి, పార్టీలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. గిరిజన జేఏసీ చైర్మన్ రాజేశ్‌నాయక్, వైశ్య వికాస వేదిక ఫౌండర్ సత్యనారాయణగుప్తా పాల్గొన్నారు.