సోనియాకు 100 మంది అసమ్మతి నేతల లెటర్..?

సోనియాకు 100 మంది అసమ్మతి నేతల లెటర్..?

లీడర్ షిప్ మార్చాలంటూ వినతులు

కాంగ్రెస్ పార్టీ మాజీ లీడర్ సంజయ్ ఝా వెల్లడి
లెటర్ ఎవరూ రాయలేదు.. ఇది బీజేపీ తొత్తుల కుట్ర: కాంగ్రెస్

న్యూఢిల్లీ: లీడర్ షిప్ ను మార్చాలని, పార్టీలో ఎన్నికలను పారదర్శకంగా జరపాలని కోరుతూ 100 మందికి పైగా అసమ్మతి నేతలు సోనియా గాంధీకి లెటర్ రాశారని సంజయ్ ఝా కామెంట్ చేశారు. సంజయ్ ను ఈ మధ్యనే కాం గ్రెస్ పార్టీ బయటకు పంపించింది.‘‘పార్టీలోని వ్యవహారాల తీరుపై బాధపడుతున్న సుమారు 100 మంది నాయకులు కాం గ్రెస్ చీఫ్ సోనియాకు లెటర్ రాశారు. ఇందులో కొందరు ఎంపీలు కూడా ఉన్నారు. లీడర్ షిప్ లో మార్పులు చేయాలని, సీడ బ్ల్ యూసీలో పారదర్శకంగా ఎన్నికలు జరగాలని కోరుతున్నారు’’ అని సంజయ్ ఝా ట్వీట్ చేశారు. అలాంటిదేం లేదు..: కాంగ్రెస్ సంజయ్ ఝా ట్వీట్ పై కాం గ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఆయన ఆరోపణలను కొట్టిపా రేసింది. ‘‘అసలు ‘ఎవరూ రాయని లెటర్’ గురిం చి మాట్లాడుతున్నారు. ఫేస్ బుక్ వివాదంనుం చి దృష్టి మరల్చే ప్రయత్నమిది. బీజేపీ తొత్తులే దీన్ని సర్క్యు లేట్ చేస్తున్నారు’’ అని మండిపడింది. కాంగ్రెస్ నేతలు లేదా ఎంపీలు సోనియాకు ఎలాంటి లెటర్ రాయలేదని పార్టీ స్పోక్స్ పర్సన్ రణ్ దీప్ సుర్జేవాలా స్పష్టం చేశారు.

అసంతృప్తి నిజమే!

సంజయ్ ట్వీట్ ను కాం గ్రెస్ ఖండిస్తున్నా.. కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నమాట నిజమేనని సమాచారం. మాజీ మంత్రులు, ఎంపీలతో సహా పార్టీలోని కొంత మంది.. తమకు ‘ఆందోళన కలిగించే విషయాల’పై చర్చించేందుకు సోనియా అపాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోరే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిసింది.