
- రూ.5,000 కోట్ల పెట్టుబడి
చిత్తూరు: ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శ్రీసిటీలో హోం అప్లయెన్సెస్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని గురువారం ప్రారంభించింది. దీనికోసం రూ.ఐదు వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించింది. భారతదేశంలో కంపెనీకి ఇది మూడో ప్లాంట్. 2026 చివరి నాటికి పూర్తి కానున్న ఈ ప్లాంట్‌లో మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏటా ఎనిమిది లక్షల రిఫ్రిజిరేటర్లు, 8.50 లక్షల వాషింగ్ మెషీన్లు, 15 లక్షల ఏసీలు, 20 లక్షల ఏసీ కంప్రెషర్లను తయారు చేయనున్నారు. ప్లాంటు శంకుస్థాపన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ (ఎల్జీఈఐఎల్) సీనియర్ అధికారులు హాజరయ్యారు.
వచ్చే ఏడాది చివరిలో ఎయిర్ కండిషనర్లతో ఉత్పత్తి మొదలవుతుంది. 2029 వరకు వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు కంప్రెషర్ల తయారీ ప్రారంభమవుతుందని అంచనా. ఎల్జీకి నోయిడా, పూణేలో ప్లాంట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం గత నవంబరులో ఈ యూనిట్‌కు ఆమోదం తెలిపింది.