IPL 2026: రూ.8.75 కోట్ల ఇంగ్లాండ్ పవర్ హిట్టర్‌కు RCB గుడ్ బై.. మయాంక్, రసిఖ్ దార్‌లకు చెక్

IPL 2026: రూ.8.75 కోట్ల ఇంగ్లాండ్ పవర్ హిట్టర్‌కు RCB గుడ్ బై.. మయాంక్, రసిఖ్ దార్‌లకు చెక్

డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2026 ఐపీఎల్ మినీ వేలానికి ముందు జట్టును మరింత పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది. డిసెంబర్ 16న అబుదాబిలో ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ జరగనుంది. అయితే అంతకు ముందు ఆటగాళ్ల రిటెన్షన్ లిస్ట్ విడుదలకు బీసీసీఐ విధించిన డెడ్ లైన్ శనివారం (నవంబర్ 15)తో ముగుస్తుంది. ఈ క్రమంలో ఆర్సీబీ ముగ్గురు ఆటగాళ్లను రిలీజ్ చేసినట్టు సమాచారం. ఈ లిస్ట్ లో ఇంగ్లాండ్ పవర్ హిట్టర్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్ తో పాటు మయాంక్ అగర్వాల్, రసిఖ్ దార్ ఉన్నారు. సాయంత్రం లోపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో భారీ ధరకు కొనుగోలు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్‌ కు బెంగళూర్ గుడ్ బై చెప్పింది. లివింగ్‌స్టోన్‌ను రూ.8.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినా ఘోరంగా విఫలమయ్యాడు. 10 మ్యాచ్‌ల్లో కేవలం 112 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. బౌలింగ్ లోనూ పెద్దగా రాణించింది లేదు.  38 సగటుతో రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో ఈ ఇంగ్లాండ్ ఆల్ పవర్ హిట్టర్ ను రిలీజ్ చేసి మినీ ఆక్షన్ కు పెద్ద మొత్తంలో వెళ్లాలని చూస్తుంది. 

మయాంక్ అగర్వాల్:
 
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ చివరిలో దేవదత్ పడిక్కల్ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. ఆ స్థానంలో మయాంక్ అగర్వాల్ కు  RCB తీసుకుంది. నాలుగు మ్యాచ్ లాడినా పర్వాలేదనిపించాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 31.67 సగటు.. 148.44 స్ట్రైక్ రేట్‌తో 95 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 18 బంతుల్లో 24 పరుగులు చేశాడు. మయాంక్ అగర్వాల్ ను ఆర్సీబీ వదిలేసుకున్నట్టు సమాచారం. ఐపీఎల్ 2026 కు అతని సేవలు అవసరం లేదని జట్టు భావిస్తోంది. దీంతో లోకల్ ప్లేయర్ మయాంక్ ను ఆర్సీబీ రిలీజ్ చేసింది. 

రసిఖ్ దార్: 

యంగ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ రసిఖ్ దార్ కూడా ఆర్సీబీ నుంచి విడుదల చేయనుంది. గత సీజన్ లో ఆర్సీబీ తరుఫున రెండు మ్యాచులు ఆడిన యంగ్ బౌలర్ ఆశించిన మేర రాణించలేదు. రెండు మ్యాచుల్లో కేవలం ఒక వికెట్ మాత్రమే తీసి నిరాశపర్చాడు. దీంతో వచ్చే సీజన్ కోసం ఆర్సీబీ అతడిని కొనసాగించడానికి ఆసక్తి చూపించలేదు.