
హైదరాబాద్ సిటీ, వెలుగు: స్వయంకృషి ట్రస్టుకు ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ 33 సీట్ల బస్సును అందజేసింది. జోనల్ ఆఫీస్లో మేనేజర్ పునిత్ కుమార్ చేతుల మీదుగా ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ మంజుల కల్యాణ్ బుధవారం ఈ బస్సును స్వీకరించారు. కార్యక్రమంలో సతీశ్ బాబు, రాజేశ్ భరద్వాజ్, ఉతఫ్జోసెఫ్, సరస్వతి, గోపకుమార్ ఉన్నారు.