
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) 24 గంటల్లో అత్యధిక జీవిత బీమా పాలసీలను విక్రయించి గిన్నిస్ ప్రపంచ రికార్డును సాధించినట్లు శనివారం ప్రకటించింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ధ్రువీకరించింది.
ఈ రికార్డును ఈ ఏడాది జనవరి 20న సాధించామని కార్పొరేషన్ తెలిపింది. ఎల్‌ఐసీకి చెందిన మొత్తం 4,52,839 ఏజెంట్లు జనవరి 20న భారతదేశం అంతటా 5,88,107 జీవిత బీమా పాలసీలను అమ్మారు.
"ఇది మా ఏజెంట్ల నిరంతర అంకిత భావం, నైపుణ్యం, శ్రమకు బలమైన రుజువు. ఈ విజయం మా కస్టమర్‌లకు, వారి కుటుంబాలకు ఆర్థిక రక్షణను అందించాలనే మా లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది" అని ఎల్ఐసీ తెలిపింది. ఎల్‌ఐసీ ఎండీ సీఈఓ సిద్ధార్థ మొహంతి జనవరి 20న ప్రతి ఏజెంట్ కనీసం ఒక పాలసీ చేయించాలని రిక్వెస్ట్ చేశారు.